వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాస గెలుపుపై లగడపాటి జోస్యం: బలముందనే.. మర్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: అవిశ్వాస తీర్మానం కోసం కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలను కూడగట్టలేని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సాధారణ ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుంటానని చెప్పడం విడ్డూరంగా ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆదివారం ఎద్దేవా చేశారు. తెలంగాణపై తీర్మానానికి కనీసం ముప్పై మందిని కూడా కెసిఆర్ కూడగట్టలేకపోయారన్నారు.

కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ సమైక్యంగానే ఉంటుందని, సమైక్యత కోసమే పాటు పడుతుందన్నారు. కాంగ్రెసు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి వస్తే ఏ పార్టీ విలీనానికైనా తమ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. తెలంగాణ వేర్పాటు వాదులకు వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు రావని లగడపాటి జోస్యం చెప్పారు. సడక్ బంద్ పేరుతో అవాంతరాలు సృష్టిస్తే ప్రభుత్వం తడాఖా చూపిస్తామని ఆయన హెచ్చరించారు.

లగడపాటిపై అసంతృప్తి

జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలువురు కాంగ్రెసు అసమ్మతి నేతలు మంత్రి పార్థసారథికి ఫిర్యాదు చేశారు. జగ్గయ్యపేట ఇండస్టియల్ ఏరియాలో పార్థసారథితో అసమ్మతి కార్యకర్తలు భేటీ అయినట్లుగా తెలుస్తోంది.

బలం ఉందనే... మర్రి

సభలో ప్రభుత్వానికి సంపూర్ణ బలం ఉందనే తాను అసెంబ్లీకి హాజరు కాలేదని సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. సభ జరుగుతున్న సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని, ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రూపంలో సమాచారం అందించానని చెప్పారు. అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ధిక్కరించిన వారిపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal said on Sunday 
 
 that seperatist like TRS will not win in 100 sets in 
 
 next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X