హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నార్వే యువతికి వేధింపులు: ప్రియుడిని కొట్టిన లవర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Five youth arrested for harassing woman
నిజామాబాద్/రాజమండ్రి: హైదరాబాదు-షిర్డి బస్సులో ప్రయాణిస్తున్న నార్వే దేశ పర్యాటకురాలిని పలువురు వ్యక్తులు వేధించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. నార్వేకు చెందిన ఓ పర్యాటకురాలు తనను ఐదుగురు వ్యక్తులు వేధిస్తున్నారని బస్సు డ్రైవర్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవరు డిచ్‌పల్లి పోలీసు స్టేషన్ వద్ద బస్సు ఆపి పోలీసులకు విషయాన్ని చెప్పాడు. పోలీసులు ఆ ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

నార్వే యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండగా తోటి ప్రయాణీకులు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా వారిని హెచ్చరించారట. బస్సును ఆపితే బాగుండదని డ్రైవర్‌ను కూడా హెచ్చరించారు. తాగిన మైకంలో ఉన్న వీరిని ఎంత అడ్డుకున్నా ఊరుకోలేదు. దీంతో డ్రైవర్ వారి మాటను బేఖాతరు చేస్తూ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

సినిమాపై మోజుతో వచ్చి..

ఓ వ్యక్తి సినిమా పైన ఉన్న మోజు కారణంగా హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత దొంగగా మారాడు. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఓ మైనర్ బాలుడు హైదరాబాద్ వచ్చాడు. ఇంటి నుండి తెచ్చుకున్న డబ్బుతో నాలుగు రోజులు గడిపాడు. ఆ తర్వాత డబ్బులు అయిపోవడంతో ఏం చేయాలో తెలియక నగరంలోని ఓ బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డాడు. సిసి కెమెరాల వల్ల అతను దొరికిపోయాడు.

ప్రియుడిని బాదిన ప్రియురాలు

ప్రేమించి పెళ్లికి నో చెప్పిన ఓ యువకుడిని ప్రియురాలు చితకబాదింది. ప్రేమించిన ప్రియుడు పెళ్లికి మాత్రం నో చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని సదరు యువతి ప్రియుడి ఇంటి వద్ద ధర్నాకు దిగింది. అయినా, పెళ్లికి నిరాకరించడంతో స్థానికుల సమక్షంలో ఆమె అతనిని కొట్టింది.

ప్రిన్సిపల్ ఆత్మహత్య

తూర్పు గోదావరి జిల్లాలో ఓ ప్రిన్సిపల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల సిబ్బంది సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

English summary
Five youths were arrested at Dichpally of Nizamabad for harassing a foreign tourist on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X