హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్వహించి తీరుతాం: కోదండరాం, అనుమతి లేదు: ఎస్పీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణపై తీర్మానం పెడితే వీగిపోతుందన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాదనలో ఎలాంటి పస లేదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం అన్నారు. తెలంగాణ ఆకాంక్షను తెలిపేందుకే ఈ నెల 21వ తేదిన సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలీసు బలగాలతో సడక్ బంద్‌ను ఆపలేరని విమర్శించారు.

ఈ నెల 21న జరిగే సడక్ బంద్‌కు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చేస్తే సడక్ బంద్‌ను ఉపసంహరించుకునే వాళ్లమని ఆయన అన్నారు. సడక్ బంద్ నేపథ్యంలో ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ఆ రోజుకు వాయిదా వేసుకోవాలని కోరారు. కిరణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయన్నారు. ప్రధాన ప్రతిపక్షం ప్రేక్షకపాత్ర వహిస్తోందని కోదండరాం దుయ్యబట్టారు.

తెలంగాణపై తీర్మానం పెట్టి విప్ జారీ చేస్తే అసెంబ్లీలో తీర్మానం పాస్ అవుతుందన్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా సడక్ బంద్ నిర్వహించి తీరుతామన్నారు. పోలీసులతో ఉద్యమాన్ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఏడు కేంద్రాల్లో సడక్ బంద్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోదండరామ్ ఆలంపూర్‌లో సడక్ బంద్ కార్యాక్రమంలో పాల్గొననున్నారు.

సడక్ బంద్‌కు అనుమతిలేదు

సడక్ బంద్ కార్యక్రమానికి అనుమతి లేదని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ నాగేంద్ర కుమార్ చెప్పారు. రేపటి నుండి ఈ నెల 23వ తేది వరకు జిల్లాలో పోలీసు యాక్టు అమలులో ఉంటుందన్నారు. ఇప్పటికే 2200 బైండోవర్ కేసులు ఉన్నాయన్నారు. మహబూబ్ నగర్‌కు వరంగల్, కరీంనగర్ పోలీసులు భద్రత కోసం వస్తారని చెప్పారు.

English summary
Telangana Political JAC chairman Kodandaram said on Tuesday that they will organized Sadak Bandh on 21st of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X