వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఆలోచన నాదే: చంద్రబాబు, జగన్‌తో సాధ్యం: షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu -Sharmila
ఏలూరు/గుంటూరు: వ్యవసాయ బడ్జెట్ ఆలోచన తనదేనని, దాన్ని కాంగ్రెసు ప్రభుత్వం కాపీ కొట్టిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. ఆయన పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ పైన స్పందించారు. వ్యవసాయ బడ్జెట్ అని చెప్పినా తీరా చూస్తే అది బడ్జెట్ కాదని, విధాన పత్రం మాత్రమే అన్నారు. ఇంతకంటే వీళ్లకు ఉన్న సమర్థత ఏమిటని ప్రశ్నించారు. రైతులకు మళ్లీ అన్యాయమే చేశారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ అని జోస్యం చెప్పారు. కానూరులో విలేకరులను కలిసినప్పుడు సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లపై తీవ్రంగా స్పందించారు. "ఇదొక తప్పుల తడక, మొక్కుబడి బడ్జెట్. కొత్త విషయమేదీ లేదు. తప్పులు సరిదిద్దుకోవడంగానీ, సంక్షోభం నుంచి బయటపడేందుకుగానీ ప్రయత్నం జరగలేదు. ప్రభుత్వ అసమర్థతకు ప్రత్యక్ష నిదర్శనం'' అని ధ్వజమెత్తారు. కేటాయింపులు లెక్కల్లో చూపారు తప్ప చిత్తశుద్ధిగానీ, తగిన కసరత్తుగానీ కన్పించడం లేద న్నారు.

రాష్ట్రంలో అప్పులు లక్షా 79 వేల కోట్ల రూపా యలకు చేరాయని, తమ హయాంలో ఈ మొత్తం రూ.55వేల కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. ఇదేనా కాంగ్రెస్ సమర్థత? అని ఎద్దేవా చేశారు. "ఏడు గంటలు కరెంటు ఇస్తామని కట్టుకథలు ఇప్పుడూ చెప్పారు. అయితే మూడేళ్లలో కరెంటు సరిగ్గా లేక 30 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింది. ఇది నిజం కాదా?'' అని ప్రశ్నించారు. జలయజ్ఞంలో కోట్లు ఖర్చుపెడుతున్నట్లు లెక్కలు చెబుతున్నారని, అదే నిజమైతే ఆయకట్టు పెరగాలిగానీ ఎందుకు క్షీణి స్తోందని ప్రశ్నించారు.

జగన్‌తోనే అభివృద్ధి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గుంటూరు జిల్లాలో అన్నారు. ఆమె పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కరవుతో రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సైతం బాబు బాటలోనే పయనిస్తున్నారని విమర్శించారు.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu, who is on his Padayatra in the West Godavari district, has alleged that the ayacut was reducing while the expenditure on Jalayagnam was increasing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X