వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా అన్నదమ్ములే: ఐదుగుర్ని పెళ్లాడిన యువతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Woman marries five ment... all brother
డెహ్రాడూన్: ఓ యువతి ఐదుగురిని పెళ్లాడిన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు సమీపంలోని రాజోవర్మ అనే యువతి ఐదుగురిని పెళ్లాడింది. మొదటి భర్త సోదరులను వివాహం చేసుకోవడం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు సమీప ప్రాంతాల్లో ఓ సంప్రదాయం. ఈ ప్రాంతానికి చెందిన ఇరవయ్యొక్క ఏళ్ల రాజోవర్మ అనే మహిళ ఈ ఆచారాన్ని కొనసాగించింది.

నాలుగేళ్ల క్రితం ఆమె గుడ్డు వర్మ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత అతడి సోదరులు బైజు వర్మ, శాంతారామ్ వర్మ, గోపాల్ వర్మ, దినేశ్ వర్మను కూడా వరుసగా వివాహం చేసుకుంది. సంప్రదాయంలో భాగంగానే ఇలా వివాహం చేసుకున్నామని రాజోవర్మ వెల్లడించింది. తామంతా ఒకే ఇంటిలో నివసిస్తున్నామని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. తమ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉందని ఆమె భర్తలు చెబుతున్నారు.

మరో విషయం వారికి పద్దెనిమిది నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే ఆ బాబు తండ్రి ఆ ఐదుగురిలో ఎవరో తెలియదని వారు చెబుతున్నారు. ఐదుగురితో పెళ్లి అంటే మొదట అందరూ ఇబ్బందిగా భావించారని, తాను మాత్రం అలా భావించలేదని రాజోవర్మ చెప్పింది. తాము ఐదుగురం అన్నదమ్ములం ఆమెతో సంసారం చేస్తున్నామని, తమలో ఎవరికీ ఒకరిపై మరొకరికి అసూయ, ద్వేషం లేదని మొదటి భర్త గుడ్డు వర్మ అన్నాడు.

గుడ్డు వర్మను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రాజోవర్మ ఆ తర్వాత బిజ్జు వర్మ(32), శాంతారామ్ వర్మ(28), గోపాల్ వర్మ(26)లను పెళ్లి చేసుకుంది. ఆఖరు తమ్ముడు దినేష్ వర్మకు గతేడాది పద్దెనిమిదేళ్లు దాటాయి. దీంతో అతనిని గతేడాది పెళ్లి చేసుకుంది. వారంతా ఒకే గదిలో ఉంటున్నారు.

English summary
A woman in India is married to five men … all brothers. The family — which lives in a one-room shack outside of Dehadun, India — came together when the oldest brother, Guddu, and the woman, Rajo Verma were a part of an arranged marriage four years ago, While Guddu is her only official spouse, her village’s customs meant she had to marry his brothers, as well. Over time she’s married Bajju, Sant Ram, Gopal and Dinesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X