వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్యారాచుట్ ఫెయిలై అంతెత్తునుండి పడ్డా తోట కాపాడింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Skydiver survives 8,000ft fall after parachutes fail
లాస్ ఏంజిల్స్: ప్యారాచూట్ సరిగా పని చేయక పోవడంతో నార్త్ కాలిఫోర్నియా స్కైడైవర్ క్రెయిగ్ స్టెపుల్‌టన్ ఎనిమిది వేల ఎత్తు నుండి కిందపడినా బతికి బయటపడ్డాడు. ఆయన వయస్సు యాభై ఒక్క ఏళ్లు. కాలిఫోర్నియా స్కైడైవింగ్‌లో ఇరవై అయిదేళ్ల అనుభవం ఉంది. ఆకాశం నుండి ఏడువేలసార్లు ప్యారాచూట్‌తో దూకిన అనుభవం ఉంది. అయితే, ఈ నెల 10వ తేదిన మాత్రం అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

స్కైడైవింగ్‌లో ఎంత అనుభవం ఉన్నా ప్యారాచూట్‌ది ప్రధాన పాత్ర. క్రెయిగ్ స్కైడైవింగ్ చేస్తున్నప్పుడు ప్యారాచూట్ పని చేయకపోవడంతో పాటు అత్యవసర ప్యారాచూట్ కూడా పని చేయలేదు. దీంతో అతను ఎనిమిదివేల అడుగుల ఎత్తు నుండి తన మిత్రుడితో పాటు పడ్డాడు. అయితే, ఓ ద్రాక్ష తోడలో పడిపోవడంతో వారు బతికి బయటపడ్డారు. వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

క్రెయిగ్, ఆయన మిత్రుడు కేట్ హాన్సన్ ఇద్దరు డౌన్ ప్లేన్ ఫ్లాగ్ విన్యాసం చేయాలనుకున్నారు. జెండాను ఎగురవేస్తూ ఆకాశం నుంచి దిగాలి. వారు అలా చేస్తున్న సమయంలో ఇది జరిగింది. తమ విమానం ఎనిమిదివేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అందులో నుండి దూకేశామని, దూకిన ఆర నిమిషం తర్వాత ప్యారాచూట్‌లో ఏదో సమస్య ఉందని తనకు అర్థమైందని క్రెయిగ్ చెప్పుకొచ్చారు.

అప్పటికే తాము గంటకు నూటా నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకు పోతున్నామన్నారు. ప్రధాన ప్యారాచ్యూట్ పని చేయక పోవడంతో తాను అత్యవసర ప్యారాచూట్ కోసం చూస్తే అది ప్రధాన ప్యారాచూట్‌లో ఇరుక్కుపోయిందని, దాంతో తమకు నూకలు చెల్లినట్లేనని భావించామన్నారు. భూమికి దగ్గరగా వస్తున్నా తాను ప్యారాచూట్ కోసం ప్రయత్నాలు చేశానని అయితే, భూమిపై పడిన తర్వాత మెత్తగా అనిపించిందని, చూస్తే ద్రాక్ష తోట అన్నారు. వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

English summary

 In a miraculous escape, a seasoned California skydiver survived an 8,000-foot fall with minor injuries and bruises after his parachutes failed and he landed on a patch of soft soil at a vineyard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X