హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: ఇక్కడ పుట్టి, అక్కడికి వెళ్లి..?

By Pratap
|
Google Oneindia TeluguNews

Dilsukhnagar Blasts
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పుట్టి పాకిస్తాన్ చేరిన వ్యక్తి దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను, హజ్ కమిటీ అధికారులను ప్రశ్నించినట్లు ఆ మీడియా సంస్థ రాసింది. నూర్ ఉల్ బషీర్ అనే వ్యక్తి 20 ఏళ్ల కింద వక్ఫ్ బోర్డులో పనిచేసినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత అతను పాకిస్తాన్ జాతీయుడిగా మారిపోయాడని భావిస్తున్నారు

ఆ పేరు గల వ్యక్తి ఎవరూ తమ వద్ద పనిచేయలేదని వక్ఫ్ బోర్డు చైర్మన్ మౌలానా ఖుస్రూ పాషా, ఇతర అధికారులు అంటున్నారు. అయితే నిఘా సంస్థ పోలీసులు ఆ మాటలను విశ్వసించడం లేదు. అతను అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో కనిపించకుండా పోయాడని, పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తూ ఉండేవాడు కావచ్చునని భావిస్తున్నారు. కుటుంబాన్ని కూడా సురక్షితంగా పాకిస్తాన్ తీసుకుని వెళ్లాడని చెబుతున్నారు.

వక్ఫ్ బోర్డులో విచారణ జరిపిన తర్వాత హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఖలీల్ అహ్మద్‌ను పోలీసులు బషీర్ గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తమకు సహకరించాలని పోలీసులు మైనారిటీ కమిషన్‌ను కోరుతున్నారు. ఖాజీలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానికుల సహకారం లేకుండా విదేశీ ఉగ్రవాదులు అంత పకడ్బందీగా పేలుళ్లకు పాల్పడి ఉండరని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదులతో చేరిపోయిన బషీర్ కొన్ని నెలలు హైదరాబాదులో ఉన్నాడని, పాకిస్తాన్‌కు ఫోన్లు చేశాడని భావిస్తున్నారు. ఆ ఫోన్ కాల్స్ తన బంధువులకు చేసినవి కావడంతో అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు.

English summary
According to a media report - While the NIA has drawn a blank on the City blasts, the counter intelligence police have interrogated Wakf Board chairman and Haj Committee officials about a man named Noor Ul Bashr, who they said had worked with Wakf board 20 years ago but later disappeared. He was a resident of Red Hills but became a Pak national later, it is said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X