• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీ శిష్యుడ్నే: టిఆర్ఎస్ హరీష్, టిడిపి నేతల ప్రశంసలు

By Srinivas
|

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు, తెలుగుదేశం పార్టీ నేతలు బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడుల మధ్య బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికరమైన చర్చ సాగింది. అసెంబ్లీ మొదటిసారి వాయిదా పడిన అనంతరం లాబీలోకి వచ్చిన హరీష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఆ సమయంలో అటుగా గాలి ముద్దుకృష్ణమ, బొజ్జల కలిసి వస్తున్నారు. వారిని చూసిన ఓ మీడియా ప్రతినిధి చిత్తూరు బ్రదర్స్ వస్తున్నారని వ్యాఖ్యానించాడు. ఈ హరీశ్ రావు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దగ్గరికి వచ్చిన గాలి ఏదో జోగి బ్రదర్స్ అన్నట్టు మమ్మల్ని చిత్తూరు బ్రదర్స్ అంటున్నావేమిటని ప్రశ్నించారు.

మా ముందు నిక్కర్లు వేసుకొని తిరిగినోడివి అంటూ.. అలా అయిపోయింది పరిస్థితంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో హరీశ్ నవ్వుతూ గాలికి, బొజ్జలకు రెండు చేతులతో నమస్కారం చేస్తూ.. తాను మీ శిష్యుడినే కదా అన్నారు. దీంతో గాలి నవ్వుతూ హరీష్ రావు భుజంపై చేయి వేశారు.

మళ్లీ హరీశ్ రావే మాట్లాడుతూ.. మీరు, మా మావయ్య, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటికి వచ్చినప్పుడు భోజనాలు వడ్డించానని, ఎలా మర్చిపోతాను సార్ అంటూ గుర్తు చేశారు. దీంతో గాలి, బొజ్జల ఇద్దరూ నవ్వుతూ.. బాగా ఎదిగావు, బాగా మాట్లాడుతున్నావంటూ మెచ్చుకున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 Telangana Rastra Samithi Siddipet MLA Harish Rao has told to TDP senior leaders Gali Muddukrishnama Naidu and Bojjala Gopala Krishna Reddy that he is the student of two leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more