వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలోనే ఫోన్‌తో జయ ఫోటోలు తీసిన ఎంపీ, ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaya Bachchan
న్యూఢిల్లీ: ఓ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు సమాజ్‌వాది పార్టీ ఎంపి, మాజీ నటి జయా బచ్చన్ ఫోటోలను సభలోనే తీశాడు. దీనిపై జయ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఓ వైపు సమావేశాలు జరుగుతుండగా ఏ మాత్రం పట్టించుకోకుండా తనను ఫొటో తీసిన అధికార పక్ష ఎంపి ప్రదీప్ కుమార్ బల్మూచుపై జయా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనపై సహచర పార్టీ సభ్యులతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంపి ప్రదీప్ తన మొబైల్ ఫోన్‌తో జయా బచ్చన్‌ను ఫోటోలు తీశారు. అప్పటికే వివిధ అంశాల పైన సభ అట్టుడికిపోతోంది. శ్రీలంక తమిళుల అంశంపై డిఎంకె, ఏఐడిఎంకె, ములాయం సింగ్ పైన కేంద్రమంత్రి వ్యాఖ్యల పైన సమాజ్ వాది పార్టీ ఎంపీలు రగడ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అధికార పార్టీ ఎంపి ప్రదీప్ జయ ఫోటోలు తీయడం మరింత వేడి రాజేసింది. ప్రదీప్ ఫోటోలు తీస్తున్న విషయాన్ని జయ గుర్తించారు.

తన ఫోటోలు తీసుకుంటున్నారని తోటి ఎంపీలతో చెప్పారు. జయతో పాటు పలువురు ఎంపీలు దీనిని తీవ్రంగా తప్పు పట్టారు. విషయం వివాదాస్పదమవడంతో తన ఫోన్‌లోని ఫొటోలను తొలగించేందుకు బల్మూచు యత్నించారు. చివరికి కాంగ్రెస్ సభ్యురాలు అంబికా సోనీ సూచనతో జయాబచ్చన్‌కు బల్మూచు క్షమాపణ చెప్పారు.

బల్మూచు కూడా ఫోన్‌లోంచి జయా బచ్చన్ ఫోటోలను తీసేశాడు. అయితే మీరు చేసిన పనికి ఏమైనా డబ్బులు చెల్లిస్తారా అంటూ జయ బచ్చన్ గట్టిగా మందలించడంతో చివరికి కాంగ్రెస్ సభ్యులు కలుగజేసుకుని సమస్యకు ముగింపు పలికారు.

English summary

 A Congress member on Wednesday created flutter in the Rajya Sabha as he apparently clicked actress-turned-politician Jaya Bachchan to which she objected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X