హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాయిరెడ్డికి ఊరట: శ్రీలక్ష్మికి వైద్యపరీక్షలకు నో

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డికి ఊరట లభించింది. జగన్ ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ముందు హాజరు కావడానికి, తన కూతురు పెళ్లికి హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ విజయసాయిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. అందుకు సిబిఐ అభ్యంతరం చెప్పలేదు. తన నిర్ణయాన్ని కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి కేసులో నిందితురాలు శ్రీలక్ష్మికి ఈ నెల 25వ తేదీలోగా వైద్య పరీక్షలు జరిపేందుకు ఉస్మానియా ఆస్పత్రుల వైద్య బోర్డు నిరాకరించింది. ఈ నెల 30వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీలక్ష్మిని తీసుకురావాలని ఆస్పత్రి వైద్యులు జైలు అధికారులకు సూచించారు.

కాగా, విదేశాలకు వెళ్లేందుకు అభ్యంతరం లేదంటూ ఆదేశాలు ఇవ్వాలని హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, అమెరికా వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని స్టైలిష్ హోమ్స్ డైరెక్టర్ రంగారావు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

విజయసాయిరెడ్డి వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఢిల్లీలో ఈడి విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఆరోగ్యం సరిగా లేనందున చికిత్స నిమిత్తం తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని శ్రీలక్ష్మి కోర్టును కోరారు.

English summary
CBI has not opposed Vijayasai Reddy's plea to allow him to travel beyond Hyderabad. He appealed to the court to allow him to travel other places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X