వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేణుక వ్యాఖ్యలు: గొడవ, మైక్‌లు విరగొట్టిన సభ్యులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Choudhary
న్యూఢిల్లీ: రాజ్యసభలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవాంఛనీయమైన సంఘటనలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. శ్రీలంక తమిళుల సమస్యను లేవనెత్తిన సమయంలో అన్నాడియంకె సభ్యులు మైక్‌లు విరగ్గొట్టారు, గాలిలోకి పేపర్లు విసిరేశారు. కాంగ్రెసు సభ్యురాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలతో డిఎంకె సభ్యులు రెచ్చిపోయారు. రేణుకా చౌదరికి, డిఎంకె సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

ఆ గొడవతో రేణుకా చౌదరి సభను వాయిదా వేసి వెళ్లిపోయారు. రేణుకా చౌదరి వ్యాఖ్యలు డిఎంకె సభ్యులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆమె వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పు పట్టారు. చైర్మన్ బల్లపై ఉన్న నాలుగు మైకుల్లో రెండింటిని అన్నాడియంకె సభ్యులు విరగ్గొట్టారు.

అన్నాడియంకె సభ్యుడు వి మైత్రేయన్ తీవ్రంగా స్పందిసతూ పేపర్లను చించి, గాలిలోకి విసిరేశారు. సభను రేణుకా చౌదరి వాయిదా వేయడంతో గొడవ సద్దుమణగలేదు. డిఎంకె సభ్యులు తిరుచి శివ, సెల్వగణపతి, వాసంతి స్టాన్లీ రేణుకా చౌదరి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. పార్లమెంటరీ సంప్రదాయానికి విరుద్ధమైన వ్యాఖ్యలుగా వాటిని అభివర్ణించారు.

భవిష్యత్తులో చైర్మన్ సీటులో రేణుకా చౌదరిని కూర్చోనీయబోమని డిఎంకె సభ్యులు హెచ్చరించారు. తమను జంతువుల్లాగా చూడలేరని అన్నారు. శ్రీలంక తమిళుల సమస్యపై అన్నాడియంకె, డిఎంకె సభ్యులు సభలో ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే.

English summary
Rajya Sabha on Friday witnessed a new low with AIADMK members breaking mikes and throwing papers in the air while raising the Sri Lankan Tamils issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X