చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీనివాసన్ కారు సిబిఐ సీజ్: స్టాలిన్ కారు మిస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Stalin-Srinivasan
న్యూఢిల్లీ: కస్టమ్స్ చట్టాలను ఉల్లంఘించి హైదరాబాదుకు చెందిన ఓ వాణిజ్యవేత్త దిగుమతి చేసిన 16 కార్లను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతను చట్టాలను ఉల్లంఘించి దిగుమతి చేసుకున్న కార్లను రాజకీయ నాయకులకు, ప్రముఖులకు విక్రయించాడు. అతను అమ్మిన కార్లలో ఎస్‌యువి డిఎంకె నాయకుడు స్టాలిన్ పేరు మీద రిజిష్టర్ అయి ఉంది.

బిసిసిఐ చీఫ్, సిమెంట్స్ ప్రమోటర్ ఎన్ శ్రీనివాసన్‌కు చెందిన 11 కార్లను సిబిఐ సీజ్ చేసింది. చెన్నైలో సోదాల సందర్భంగా సిబిఐ అధికారులు కార్లను స్వాధీనం చేసుకున్నారు. దిగుమతి చేసుకున్న కార్లపై పన్నులను శ్రీనివాసన్ ఎగవేశాడని ఆరోపణలున్నాయి.

యుపిఎకు డిఎంకెకు మద్దతు ఉపసంహరించుకున్న వెంటనే సిబిఐ అధికారులు స్టాలిన్ నివాసంలో సోదాలు చేశారు. 2007లో దిగుమతైన స్టాలిన్ ఎస్‌యువి హమ్మర్ కారు కోసం సిబిఐ అధికారులు అన్వేషిస్తున్నారు. అలెక్స్ సి. జోసెఫ్ అనే వ్యాపారి చట్టాలను ఉల్లంఘించి మరిన్ని వాహనాలను దిగుమతి చేసుకుని ఉంటాడని సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు.

జోసెఫ్ కోసం గాలింపు

జోసెఫ్ కోసం సిబిఐ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కారు స్మగ్లర్ జోసెఫ్ 500 లగ్జరీ, ఎస్‌యువి కార్లను దేశానికి తరలించి ఉంటాడని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. స్టాలిన్‌కే కాకుండా డిఎంకె మరో నేత అళగిరికి కూడా అతను ఓ కారును అమ్మి ఉంటాడని అనుమానిస్తున్నారు.

ఢిల్లీలో రూ. 4.5 కోట్ల విలువ చేసే జోసెఫ్ భార్య ఆస్తుల పత్రాలను తాము స్వాధీనం చేసుకున్నామని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని సిబిఐ అధికారులు అంటున్నారు. అతనికి ఢిల్లీ, కేరళ, చెన్నైల్లో శక్తివంతమైన మిత్రులు ఉన్నారని, రాజకీయ రంగంలోనే కాకుండా వాణిజ్య రంగంలో కూడా అతనికి మిత్రులు ఉన్నారని, అతను కనిపించకుండా పోయాడని అంటున్నారు. అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు.

English summary
CBI has recovered 16 more luxury vehicles imported by a Hyderabad-based businessman in alleged violation of customs laws which have been sold to various influential persons even as the SUV registered in the name of DMK leader M K Stalin remained untraceable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X