వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌తో సత్సంబంధాలే: పాక్ గడ్డపై ముషారఫ్ అడుగు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pervez Musharraf
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆదివారం మధ్యాహ్నం తన సొంత దేశానికి చేరుకున్నారు. దుబాయ్ నుండి చార్టర్డ్ ఫ్లైట్‌లో అతను మధ్యాహ్నం కరాచీకి చేరుకున్నాడు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన అడుగిడాడు. నాలుగేళ్లుగా పాక్‌కు ముషారఫ్ దూరంగా ఉన్నారు.

ముషారఫ్ ఆల్ పార్టీ ముస్లీం లీగ్ పార్టీ నేత. కరాచీలో అడుగు పెట్టిన తర్వాత ముషారఫ్ మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. సాయంత్రం ఐదు గంటలకు విమానాశ్రయం వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తానని ముషారఫ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముషారఫ్ విమానం ఎక్కి సీట్లో కూర్చున్న తన ఫోటోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ముషారఫ్ పైన పలు ఆరోపణలు ఉన్నాయి. 2006-07లో న్యాయమూర్తులను నిర్బంధించారనే ఆరోపణలు, దివంగత పాక్ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కుట్ర ఆరోపణ, బెలూచిస్తాన్ లీడర్ నవాబ్ హత్య కేసులో ఆరోపణలను ముషారఫ్ ఎదుర్కొంటున్నారు. మరోవైపు ముషారఫ్ వస్తే ఆత్మాహుతి దాడులతో మట్టుబెడుతామని తాలిబన్‌లు హెచ్చరించారు.

పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ తమకు లొంగిపోవాలని, లేకపోతే ఆత్మాహుతి దాడితో అంతం చేస్తామని పాక్ తాలిబన్లు హెచ్చరించారు. శనివారం తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ అధికార ప్రతినిధి ఇహ్‌సానుల్లా ఇహ్‌సాన్ మీడియా ప్రతినిధులకు పంపిన వీడియోలో ఈ మేరకు ప్రకటించారు.

లాల్ మసీదుపై 2007నాటి దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం... నిన్ను ప్రాణాలతో వదిలేది లేదు'' అని అందులో పేర్కొన్నారు. అలాగే ముషారఫ్‌పై హత్యాయత్నం తర్వాత జైలుపాలై, నిరుడు తప్పించుకుపోయిన ఉగ్రవాది అద్నన్ రషీద్ కొందరు ఆత్మాహుతి దళ సభ్యులకు శిక్షణ ఇస్తున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి.

అయితే, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని ముషారఫ్ దీటుగా బదులిచ్చారు. నాలుగేళ్లుగా లండన్‌లో తలదాచుకున్న అనంతరం శనివారం రాత్రి దుబాయ్‌కి చేరుకున్నారు. అనంతరం ఈ ఉదయం ఆదివారం కరాచీకి బయలుదేరి వచ్చారు. "నాలుగు దశాబ్దాలపాటు సైన్యంలో ఉన్నాను. కాకలు తీరిన మాజీ కమాండోనైన నేను, పిరికిపందల బెదిరింపులకు భయపడబోన''నని తాలిబన్లకు ధీటుగా స్పందించారు.

భారత్‌తో సంబంధాలు మెరుగుపడాలి

భారత దేశంతో సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరముందని ముషారఫ్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య శాంతిపునరుద్ధరణకు తాను కృషి చేస్తానని చెప్పారు. పాకిస్తాన్‌ను రక్షించాల్సిన అవసరముందన్నారు.

English summary
Ending four years of self-imposed exile, Pakistan's former military ruler Pervez Musharraf returned home on Sunday to take part in the May 11 general elections despite a Taliban death threat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X