వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడేడు తరాలు.. ఆషామాషీగా ఇవ్వం: బాబు హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాజమండ్రి/హైదరాబాద్: ఎన్నికల్లో ఆశావహులకు టిక్కెట్లు ఆషామాషీగా ఇవ్వమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. టిక్కెట్ ఇచ్చే అభ్యర్థుల అటు ఏడు ఇటు ఏడు తరాల చరిత్ర చూస్తామన్నారు. స్వంత ప్రయోజనాల కోసం పార్టీని ఉపయోగించుకోవద్దని ఆయన కొందరు నేతలకు చురకలు అంటించారు. స్వంత ప్రయోజనాల కోసం చూసే వారికి టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.

అవకాశవాదులకు టిక్కెట్లు ఇవ్వమని చెప్పారు. అభ్యర్థుల గత చరిత్రను పూర్తిగా పరిశీలించిన మీదటే టిక్కెట్ ఇస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజమండ్రి, రాజమండ్రి రూరల్ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టిక్కెట్ల విషయంలో కార్యకర్తల అభిప్రాయాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కార్యకర్త నుంచి పార్లమెంటు సభ్యుడి వరకు పార్టీలో ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో పర్యటించాలని సూచించారు. మరోవైపు, వ్యక్తిగత రహస్య ఎస్సెమ్మెస్ విధానం ద్వారా కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని తెలిపేలా ఓ విధానాన్ని ప్రవేశ పెట్టాలని ఓ కార్యకర్త సూచించగా చంద్రబాబు దానిని పరిశీలిస్తానని చెప్పారు.

విద్యుత్ రంగంపై టిడిఎల్పీ నిరసన పత్రం

విద్యుత్ రంగం పైన టిడిపి శాసనసభా పక్షం నిరసన పత్రం విడుదల చేసింది. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అసెంబ్లీని వాయిదా వేస్తున్నారని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాదులో ఆరోపించారు. కనీసం ముప్పై రోజులు కూడా అసెంబ్లీని నడపట్లేదని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘతన తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసులకే దక్కుతుందని మండిపడ్డారు.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu said on Monday that he will give tickets those leaders are in public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X