తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెప్పపై రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి ధగధగ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుమల శ్రీవారి తెప్పోత్సవం రెండో రోజు భక్తులకు కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సాయంత్రం రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి పుష్కరణిలో విహరించారు. ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి నాలుగు మాడవీధుల ప్రదక్షిణల అనంతరం పుష్కరణి వద్దకు చేరుకున్నారు.

శాస్త్రోక్త కార్యక్రమాల అనంతరం రాత్రి ఏడు గంటలకు తెప్పోత్సవం ప్రారంభమైంది. మంగళ వాయిద్యాలు, అర్చకుల వేదమంత్రాల నడుమ స్వామివారు తెప్పపై మూడుసార్లు విహరించారు. తెప్పోత్సవంలో భాగంగా ఈ రోజు(సోమవారం) శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తెప్పపై విహరించనున్నారు.

గోవా గవర్నర్ భరత్ వీర్ వాంఛూ సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో గవర్నర్ దంపతులు స్వామివారిని దర్సించుకొని కానుకలు సమర్పించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపం చేరుకున్న వారికి అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.

స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న స్పీకర్, రంగనాయకుల మండపం వద్ద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

తెప్పపై శ్రీకృష్ణ స్వామి ధగధగ(పిక్చర్స్)

తెప్పోత్సవ దృశ్యం

తెప్పపై శ్రీకృష్ణ స్వామి ధగధగ(పిక్చర్స్)

తెప్పపై రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి

తెప్పపై శ్రీకృష్ణ స్వామి ధగధగ(పిక్చర్స్)

వీక్షిస్తున్న భక్తకోటి

తెప్పపై శ్రీకృష్ణ స్వామి ధగధగ(పిక్చర్స్)

స్వామి వారి వద్ద....

తెప్పపై శ్రీకృష్ణ స్వామి ధగధగ(పిక్చర్స్)

స్వామి వారు

తెప్పపై శ్రీకృష్ణ స్వామి ధగధగ(పిక్చర్స్)

ఆదివారం స్వామివారిని స్పీకర్ దర్శించుకున్నారు

తెప్పపై శ్రీకృష్ణ స్వామి ధగధగ(పిక్చర్స్)

తిరుమల శ్రీవారి సేవలో గోవా గవర్నర్ భరత్ వీర్ వాంచూ ఆయన సతీమణి నళిని వాంచూ

తెప్పపై శ్రీకృష్ణ స్వామి ధగధగ(పిక్చర్స్)

తిరుమలలో విజయా బ్యాంక్‌ను ప్రారంభించిన టిటిడి డిప్యూటీ రమణ

English summary
Sri Vari Annual FLOAT FESTIVAL -II DAY at Tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X