హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి వెళ్తే అడ్డుకోలేరు: ఎమ్మెల్యే సుధీర్ షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devireddy Sudhir Reddy
హైదరాబాద్: తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళితే తనను ఎవరూ అడ్డుకోలేరని రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సోమవారం అన్నారు. సుధీర్ రెడ్డి 2009లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. అతను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.

దీనిపై ఆయన స్పందించారు. తాను పార్టీ మారుతాననే ఊహాగానాలపై, ప్రచారంపై తాను స్పందించనని చెప్పారు. ఒకవేళ తాను పార్టీ మారినా తనను అడ్డుకునే వారు లేరన్నారు. తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవన్నారు. పార్టీ మారుతాననే ప్రచారాన్ని తాను ఖండించేది లేదన్నారు. తనకు జగన్ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన వస్తే అందరికీ చెప్పే వెళ్తానని ఆయన చెప్పారు.

తాను వెళ్తానని ప్రచారం జరగడంతో పార్టీ పెద్దలు దీనిని ఖండించమని తనకు చెప్పారని అయితే, అలాంటి ఊహాగాన వార్తలను తాను ఎందుకు ఖండించాలని అడిగానని అన్నారు. పార్టీ మారాలనుకుంటే తనకు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అలాంటి ఆలోచన వస్తే ఎప్పుడైనా వెళ్లవచ్చునని అన్నారు.

కాగా, ఇటీవల కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఆయన జగన్ పార్టీలోకి మారనున్నారు. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వెళ్తారనే ప్రచారం కూడా సాగింది. దీనిపై దేవిరెడ్డి స్పందించారు.

English summary
LB Nagar MLA Devireddy Sudhir Reddy on Monday refused to talk on party change issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X