వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ తప్ప రావొచ్చు: ఎర్రబెల్లి, విజయమ్మ సెటైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao - YS Vijayamma
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ దీక్షను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం అన్నారు. హైదరాబాదులోని మహాత్మా గాంధీ ఆసుపత్రిలో వామపక్ష నేతలు దీక్ష చేస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపేందుకు విజయమ్మ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యుత్ సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక పోరాటాలు అవసరమన్నారు. త్వరలో విద్యుత్ సమస్యపై పోరాటాడానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. టిడిపి దీక్షను అందరూ గమనిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

దీక్ష విరమించిన వామపక్ష నేతలు

గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న వామపక్షాల నేతలు ఈ రోజు దీక్షను విరమించారు. విద్యుత్ సమస్యల పైన ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకే తాము దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం మూడు గంటలకు తమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. విపక్షాలతో కలిసి వెళ్తామన్నారు. విద్యుత్ విషయంలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమంపై వెనక్కి తగ్గేది లేదని వారు చెప్పారు. టిడిపి నేతల దీక్షకు మద్దతిస్తున్నట్లు లెఫ్ట్ పార్టీ నేతలు చెప్పారు.

ఎమ్మెల్యేలకు బాబు ఫోన్

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్సులో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్నారు. వారికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇతర ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలకు కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యేల దీక్షకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులు తగలబెట్టాలని సూచించారు.

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్సులో దీక్ష చేస్తున్న టిడిపి నేతలకు సిపిఎం శాసనసభా పక్ష నేత జూలకంటి రంగారెడ్డి సంఘీభావం తెలిపారు. ఆయన అక్కడకు వచ్చి వారిని పరామర్శించారు. దీక్షా శిబిరం వద్దకు జూలకంటి వచ్చిన విషయం తెలుసుకున్న బాబు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. విద్యుత్ సమస్యల విషయంలో సమన్వయంతో వెళ్దామని వారికి సూచించారు. సిపిఐఎల్పీ గూండా మల్లేష్ కూడా దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు.

జగన్ పార్టీ తప్ప...

విద్యుత్ విషయంలో తాము చేస్తున్న ఉద్యమానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్ప ఏ పార్టీ వచ్చినా కలిసి పోరాడుతామని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ప్రస్తుత సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమని ఆరోపించారు.

English summary
Telugudesam Party senior leader Errabelli Dayakar Rao has blamed late YS Rajasekhar Reddy for power crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X