• search
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్టీఆర్ పొలిటిక్స్: ఆపరేషన్ 2019, ఇప్పుడు జగనే?

By Pratap
|
Jr Ntr
హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పక్కా పథకం ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. రాజకీయాల్లో తన అడుగులు స్థిరంగా పడే విధంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఆయన వర్గానికి చెందిన కొడాలి నాని వైయస్ జగన్ పార్టీలోకి వెళ్లడం, తాజాగా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తిరుగుబాటు ప్రకటించడం ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. చంద్రబాబు గానీ, బాబాయ్ బాలకృష్ణ గానీ జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీలో తగిన స్థానం కల్పించడానికి సిద్దంగా లేరనేది ప్రచారంలో ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబుతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. బాలకృష్ణ చంద్రబాబుకు సహకారం అందిస్తూ తెలుగుదేశం పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. పార్లమెంటుకు బాలయ్య పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీలోని కొంత మంది నాయకులు అంటుండగా, తాను శానససభకే పోటీ చేస్తానని ఆయన పదే పదే చెబుతున్నారు. దీన్ని బట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో ఓ అధికార కేంద్రంగా మారేందుకు సిద్ధపడినట్లు అర్థమవుతోంది.

తన తనయుడు నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు అప్పగించడానికి జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంగా ఉంచాలనే స్థిర నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలోకి రానీయడం లేదని, అటువంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి తన భవిష్యత్తును తాను చూసుకోవాలి కదా అని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో అన్నారు. రానిస్తే తాను కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ చంద్రబాబు రానీయడని ఆమె అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా రానీయడం లేదని ఆమె అన్నారు.

మరో వైపు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీన్నిబట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంత జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు నోరు విప్పలేదు. పైగా, నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టే లోగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారాన్ని తేల్చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లాన్ ప్రకారమే వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు, అంటే 2014లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించే పరిస్థితి లేదు. సినిమాలతో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. సినిమాలను వదిలేసి రాజకీయాలకు రావడం కూడా ఆయన ఉద్దేశం కాదు. కానీ, భవిష్యత్తు రాజకీయ ప్రవేశానికి తగిన ఏర్పాటు మాత్రం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

2019 ఎన్నికల నాటికి రాజకీయాల్లో తన సత్తా చాటాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈలోగా తన వర్గానికి చెందినవారిని ఇతరత్రా మార్గాలు చూసుకోవాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారని, వల్లభనేని వంశీ తిరుగుబాటుకు సిద్ధపడ్డారని అంటున్నారు.

ఈ పరిణామాన్ని వైయస్ జగన్ కూడా జాగ్రత్తగానే గమనిస్తున్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎత్తుగడలను ప్రస్తుతానికి తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే, తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందిన నాయకులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంతో రసకందాయంలో పడ్డాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
21,84,467
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  0.00%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  100.00%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  3.89%
  ఎస్సీ
 • ఎస్టీ
  1.24%
  ఎస్టీ

English summary
It is said that - Jr Ntr is having his own plan regarding his future politics. He has targeted 2019 elections. It is clear that he was out of Telugudesam party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more