వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుద్ధి రాలేదు: జగన్ పార్టీ, అంబానీని ప్రశ్నించరేం: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్/నెల్లూరు: రాష్ట్ర ప్రజలు రెండుసార్లు ఓడించినా తెలుగుదేశం పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సోమయాజులు బుధవారం మండిపడ్డారు. విద్యుత్ సమస్యల పైన టిడిపి బ్లాక్ పేపర్ పెట్టడం ఓ జోక్ అన్నారు. ఇది ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నమే అని విమర్శించారు. టిడిపి పెట్టిన బ్లాక్ పేపర్‌లో సర్కారును నిలదీసే అంశాలే లేవన్నారు. గ్యాస్, బొగ్గు, నీరు తగ్గడానికి గల కారణాలను బ్లాక్ పేపర్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

విద్యుత్ సమస్యల పైన తెలుగుదేశం పార్టీ సరిగా లేదన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుసరించిన అస్తవ్యస్త విధానాల వల్లనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని ఆరోపించారు. విద్యుత్ సమస్యల పైన చంద్రబాబుకు దృష్టి, చిత్తశుద్ధి లేదన్నారు. గతంలో ఎన్నడు లేనంత విద్యుత్ కొరత ఎందుకు వచ్చిందో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.

రాష్ట్రంలో పెట్టుబడులు గణనీయంగా పెరిగినా విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచుతున్నారన్నారు. రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇస్తా.. ఛార్జీలు పెంచకుండా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలించారన్నారు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా ఛార్జీలు పెంచుతున్న విషయం బాబుకు తెలియదా అన్నారు. విద్యుత్ సమస్య విషయంలో టిడిపి అవాస్తవాలు చెబుతోందని, అర్ధరాత్రి సమయంలో ఒప్పందం చేసుకున్నది ఆయనే అన్నారు.

రిలయన్స్‌ను ప్రశ్నించరేం?: సోమిరెడ్డి

విద్యుత్ ప్రాజెక్టు అమలు ఒప్పందాన్ని ఉల్లంఘించిన రిలయన్స్‌ను ప్రశ్నించే ధైర్యం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు చేయడం లేదని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం చేతకానితనం వల్లనే రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు వచ్చాయన్నారు.

టిడిపి దీక్ష: సెలైన్‌కు గాలి విముఖత

విద్యుత్ సమస్య పరిష్కారం కోసం పాత ఎమ్మెల్యే క్వార్టర్సులో నిరవధిక దీక్ష చేస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు షుగర్ లెవల్స్ పడిపోయాయి. సెలైన్ పెట్టుకోవాలన్న వైద్యుల సూచనను గాలి తిరస్కరించారు.

English summary

 YSR Congress Party leader Somayajulu has blamed Telugudesam Party chief Nara Chandrababu Naidu for power crisis in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X