హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోలీ వేడుకల్లో అపశృతులు: 8 మంది దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హోలీ వేడుకుల్లో రాష్ట్రంలో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో బుధవారంనాడు ఎనిమిది మంది మరణించారు. హైదరాబాదులోని కూకట్‌పల్లిలో గల ఐడియల్ ప్రాంతంలో ఓ యువకుడు బావిలో మునిగి చనిపోయాడు.

హోలీ వేడుకుల్లో రంగులు చల్లుకున్న తర్వాత స్నానం చేయడానికి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయి మరణించాడు. నల్లగొండ జిల్లాలో ఓ ఆరేళ్ల బాలుడు మరణించాడు. హోలీ వేడుకల తర్వాత స్నానం చేస్తుండగా ట్యాంకులో పడి అతను చనిపోయాడు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కోయలగూడెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

హోలీ వేడుకలు జరుపుకుంటుండగా ట్రక్ ఢీకొట్టడంతో ఓ యువకుడు మరణించాడు. ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పులలో చోటు చేసుకుంది.

కడప జిల్లాలో మిత్రులతో హోలీ ఆడుకుంటూ ఓ ఐదేళ్ల బాలుడు బోర్‌వెల్‌లో పడిపోయాడు. గ్రామస్థులు అతన్ని వెలికి తీసి కాపాడారు. ఈ సంఘటన కడప జిల్లా వేంపల్లి మండలం కుమరంపల్లిలో జరిగింది.

నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు విద్యార్థులు మరణించారు. హోలీ వేడుకల తర్వాత సిరికొండ బసంత్ నగర్ చెరువులో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్థులు మరణించారు. దీంతో స్థానికంగా విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం విద్యార్థులంతా కలిసి బసంత్‌నగర్ చెరువుకు స్నానానికి వెళ్లారు. స్నానం చేసిన తర్వాత ఇళ్లకు తిరిగి వచ్చిన తర్వాత చూస్తే ఐదుగురు కనిపించలేదు. దీంతో గాలింపు చేపట్టారు. గాలింపులో ఐదుగురి శవాలు చెరువులో కనిపించాయి.

English summary
Tragedy struck Holi celebrations in Andhra Pradesh on Wednesday with the death of three people in three separate incidents, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X