వంశీ.. జగన్ పార్టీలోకి వెళ్తారని కలగన్నారా?: బాబు

దీనిపై చంద్రబాబును విలేకరులు ప్రశ్నించారు. వంశీని తాము బాగానే చూసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. అతనిని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నామని చెప్పారు. విజయవాడ లోకసభ స్థానం నుండి పోటీ చేయాలని తాను మొదట సూచించానని, అందుకు వంశీ నిరాకరించారని చెప్పారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తున్నట్లుగా వచ్చే వార్తలపై స్పందిస్తూ.. ఆయన జగన్ పార్టీలోకి వెళ్తున్నట్లు మీరేమైనా కల కన్నారా? అని చంద్రబాబు విలేకరులను ఎదురు ప్రశ్నించారు. వంశీకి ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలో నిర్ణయిస్తామని చెప్పారు. ఎవరికి పదవి ఇవ్వాలో తెలుసన్నారు. ఆయన పార్టీ వీడరన్నారు.
కాగా, వంశీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తన అసంతృప్తిని బుధవారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం టిక్కెట్ తనకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ, ఈ విషయమై సిట్టింగ్ శాసనసభ్యుడు దాసరి బాలవర్ధన రావును తనతో మాట్లాడించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దాసరి బాలవర్ధన రావుతో మాట్లాడిస్తే తనకు పూర్తి నమ్మకముంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రగ కార్యనిర్వాహక కార్యదర్శి పదవి రాష్ట్రంలో ఎంతో మందికి ఉందన్నారు. విజయవాడ పట్టణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతగా కృషి చేసినా పార్టీ అధిష్టానం మాత్రం తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!