వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీతపై రేప్ కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxman Mane
సతారా: ప్రముఖ మరాఠీ రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత లక్ష్మణ్ మానేపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి. పశ్చిమ మహారాష్ట్రలోని ముగ్గురు దళిత మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆయనపై కేసులు నమోదయ్యాయి. 63 ఏళ్ల సామాజిక కార్యకర్త కూడా అయిన మానేపై ముగ్గురు మహిళలు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

సతారాకు సమీపంలోని జకత్వాడీలో గల ఆశ్రమ్ శాల (గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాల)లో ఆ ముగ్గురు మహిళలు వంట మనుషులుగా పనిచేస్తున్నారు. పాఠశాలలో తమ ఉద్యోగాలను కన్‌ఫర్మ్ చేస్తానని చెప్పి తమపై అత్యాచారం చేశాడని వారు ఆరోపించారు. పాఠశాలకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాడు.

పెళ్లిళ్లు చేసుకున్న ముగ్గురు మహిళల వయస్సు 30, 35 మధ్య ఉంటుంది. మానే తమపై 2003, 2010 మధ్య కాలంలో అత్యాచారం చేశాడని వారు ఆరోపించారు. మానే నివాసం సతారా ఉంది. పూణేలో ఓ అతిథి గృహం ఉంది.

తాము మానేను పట్టుకోవడానికి ఇంటికి వెళ్లామని, అతను ఎక్కువగా వెళ్లే చోట్లకు కూడా వెళ్లామని, కానీ అతని జాడ కనిపించలేదని పోలీసులు అంటున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అదనపు పోలీసు సూపరింటిండెంట్ అమోల్ తాంబే చెప్పారు.

తన తండ్రిపై తప్పుడు కేసులు బనాయించారని, తమ తండ్రిపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, పాఠశాలకు చెందిన కొంత మంది తమ తండ్రిని తప్పుడు కేసుల్లో ఇరికించడానికి కుట్ర చేశారని మానే కుమారుడు భాయ్ అంటున్నారు. ఆయన భార్య శశితాయ్ కూడా ఆరోపణలను ఖండించారు.

మానేకు 1981లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2009లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. మానే పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని స్థానిక శివసేన, బిజెపి, ఇతర రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

English summary

 Eminent Marathi author Laxman Mane, a Padma Shri awardee, has been booked for allegedly raping three women, all Dalits, here in Western Maharashtra, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X