వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నటులకు ప్రత్యేక చట్టాల్లేవు: సంజయ్‌కి శిక్ష సరైన చర్య'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sanjay Dutt
అనంతపురం: దేశంలో సినీ నటులకు ప్రత్యేక చట్టాలు ఏమీ ఉండవని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బుధవారం అన్నారు. ఆయన అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభమైన బిజెపి ఆత్మీయ సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు జైలు శిక్ష పడటం సరైన చర్యగా చెప్పుకొచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే శ్రీలంక క్రికెటర్ల పైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిషేధం విధించాలని ఆయన అన్నారు.

పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు తథ్యమని వెంకయ్య నాయుడు అంతకుముందు జోస్యం చెప్పారు. అక్టోబరులో ఎన్నికలు రావొచ్చునని ఆయన చెప్పారు. దేశంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనంగానే ఉంటారని విమర్శించారు. గట్టి నిర్ణయాలు తీసుకుంటారనే ఉద్దేశ్యంతోనే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రజలు ప్రధాని అభ్యర్థిగా కోరుకుంటున్నారని అన్నారు.

కాంగ్రెసు ప్రభుత్వం అంతాన్ని ప్రజలు కోరుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబరుపేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి బిజెపి ఆత్మీయ సదస్సులో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు అన్ని మద్దతిచ్చాయని గుర్తు చేశారు. అవిశ్వాసం సమయంలో తెలుగుదేశం, మజ్లిస్ పార్టీలు మాత్రమే మద్దతివ్వలేదన్నారు. ఆ పార్టీని టిడిపియే కాపాడుతోందన్నారు. అవిశ్వాసం సమయంలో ఆ పార్టీల తీరు దారుణం అన్నారు.

English summary

 Bharatiya Janata Party senior leader Venkaiah Naidu has said on Wednesday that Bollywood actor Sanjay Dutt shoud be punished.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X