వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ కుక్క చావు: గోనె మండిపడ్డారు, సర్వే తగ్గారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sarve Satyanarayana - Gone Prakesh Rao
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మీద కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ్ రావు గురువారం మండిపడ్డారు. అదే సమయంలో సర్వే సత్యనారాయణ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ రోజు ఉదయం సర్వే వ్యాఖ్యలపై గోనే తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి పైన నీచాతినీచమైన వ్యాఖ్యలు చేయడం సర్వే కుసంస్కరానికి నిదర్శనమన్నారు.

వైయస్ మహానేత అని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లే కొనియాడారని చెప్పారు. అలాంటి వైయస్ పైన అంత దారుణంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వకుంటే 2014లో కాంగ్రెసు పార్టీ నేతలను చెప్పులతో కొట్టవచ్చునని సర్వే చెప్పినది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గన్‌మన్ లేకుండా ప్రచారానికి వెళ్లే దమ్ము సర్వేకు ఉందా అని సవాల్ చేశారు.

కంటోన్మెంట్ బోర్డు మెంబర్‌గా ఓడిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ఎంపీ టిక్కెట్ కోసం వైయస్ కాళ్లు పట్టుకున్న సందర్భం మర్చిపోయినట్లున్నారన్నారు. హైవేల నిర్మాణ రూట్లను మారుస్తూ సర్వే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైయస్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీల మరణాలను ఏమనాలని ప్రశ్నించారు. సభ్యత లేకుండా మాట్లాడటం ఆయనకే చెల్లిందన్నారు.

వెనక్కి తీసుకుంటున్నా

మరోవైపు వైయస్ రాజశేఖర రెడ్డి కుక్క కన్నా హీనంగా చచ్చాడని సర్వే సత్యనారాయణ నాలుగు రోజుల క్రితం అన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకుంటున్నట్లు సర్వే చెప్పారు. తాను వైయస్‌పై ఉద్దేశ్య పూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. వాటిని తాను వెనక్కి తీసుకుంటున్నానన్నారు.

English summary

 YSR Congress Party leader Gone Prakash Rao has lashed out at Central Minister Sarve Satyanarayana for his comments against late YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X