వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాని, వనిత..: జగన్ వర్గంపై ఫిర్యాదు, ఇద్దరు టి నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodali Nani - Vanitha
హైదరాబాద్: శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తమ పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ గురువారం రాత్రి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. విప్ ధిక్కరించడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు స్పీకర్‌ను ఈ సందర్భంగా కోరారు.

శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తమ పార్టీ విప్‌ను ఉల్లంఘించారంటూ తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన టిడిపి వారిపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరింది. వారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో ఏడుగురు సీమాంధ్ర నేతలు, ఇద్దరు తెలంగాణ నేతలు ఉన్నారు.

విప్ ఉల్లంఘనపై ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితాలో శిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం), తానేటి వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), చిన్నం రామకోటయ్య (నూజివీడు), అమర్నాథ్ రెడ్డి (పలమనేరు), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), బాలనాగి రెడ్డి (మంత్రాలయం), హరీశ్వర్ రెడ్డి (పరిగి), వేణు గోపాలాచారి (ముధోల్)లు ఉన్నారు.

అవిశ్వాసంపై రెండు దఫాల ఓటింగ్‌కు అందరూ హాజరై తటస్థంగా వ్యవహరించాలని టిడిపి విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే చిన్నం రామకోటయ్య, వేణు గోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి ఓటింగ్‌కు రాలేదు. మిగిలిన వారు వచ్చినా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే, హరీశ్వర్ రెడ్డి అవిశ్వాసాన్ని చర్చకు తీసుకోవచ్చా లేదా అన్నదానిపై ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వీరికి నోటీసులు జారీ చేసి, సమాధానం అందిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.

English summary

 Telugudesam Party has complained to speaker Nadendla Manohar on Nine MLAs on Thursday night and appealed take actions against them as soon as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X