బాబు మోసం చేశాడు: కిరణ్, దామోదర రెడ్డి ప్రశంసలు

Kiran Kumar Reddy
సూర్యాపేట: అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడని, అధికారంలో లేనప్పుడు కూడా చంద్రబాబు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం నల్లగొండ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం అలవాటు అని, వాస్తవాలు చెప్పడం తన నైజం అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉందని, దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఉగాది నుంచి చౌకధరల దుకాణాల ద్వారా ఇతర సరుకులు ఇప్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. చిన్న వయస్సులోనే తాను ముఖ్యమంత్రిని అయ్యానని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అబివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టాయని, కానీ తాము అలా చేయడం లేదని, నిజాలే చెబుతున్నామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

తాము చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందినప్పుడే సార్థకత అని ఆయన అన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఎవరూ అధైరపడవద్దని ఆయన అన్నారు. మహిళాభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, ప్రతి కార్యక్రమాన్ని మహిళల పేరు మీదనే చేపడుతున్నామని ఆయన చెప్పారు. బిసిల సంక్షేమానికి తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.

కిరణ్‌పై దామోదర రెడ్డి ప్రశంసల జల్లు

వీర తెలంగాణవాదిగా పేరు పొందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తిని తాను దేశచరిత్రలో ఇప్పటివరకు చూడలేదని ఆయన అన్నారు. ప్రాంతాలకు అతీతంగా కిరణ్ కుమార్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన చెప్పారు. 2014లో కూడా కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ

నల్లగొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సూర్యాపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా జై తెలంగాణ నినాదాలతో తెలంగాణవాదులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ గైర్హాజర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యక్రమాలకు నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ హాజరు కాలేదు. శానససభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యక్రమాలకు హాజరు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+