హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊడిపడిన విమానం డోర్: ఎపిఎక్స్‌ప్రెస్ బోగీలో మంటలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Fire aboard AP express
పనాజీ/నాగపూర్: గోవాలో ఎయిర్ ఇండియా విమానానికి శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. గోవా విమానాశ్రయంలో విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో డోర్ ఒక్కసారిగా ఊడిపడిపోయింది. విమానం రన్ వే పైన ఉండగానే ఇది జరిగింది. దీనిని వెంటనే గుర్తించిన పైలట్ విమానాన్ని రన్ వే పైనే నిలిపి వేశాడు.

ఈ విమానం గోవా నుండి పూణే మీదుగా హైదరాబాద్ రావాల్సి ఉంది. ఇందులో దాదాపు రెండు వందల మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. ప్రయాణీకుల్లో ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల కూడా ఉన్నారు. పూణే, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన ప్రయాణీకుల్లో ఎక్కువగా తెలుగువారే ఉన్నారు.

ఈ విమానం మధ్యాహ్నం నిర్ణీత సమయం 1.45 నిమిషాలకు టేకాఫ్ తీసుకుంటుండగా డోర్ ఒక్కసారిగా విరిగింది. పైలట్ వెంటనే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి ఎగిరి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. పైలట్ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. బాంబే నుండి మరో విమానాన్ని రప్పించి ప్రయాణీకులను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎపి ఎక్స్‌ప్రెస్‌ బోగిలో మంటలు

ఎపి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-8 బోగిలో శుక్రవారం మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణీకులు చైన్ లాగడంతో రైలును నాగపూర్ దాటిన తర్వాత నిలిపివేశారు. బోగిలో పొగ కమ్ముకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పి వేశారు. అనంతరం రైలును నాగపూర్ తీసుకు వెళ్లి బోగిని మార్చారు.

English summary
Major fire broke out in one of the bogies of AP Express on Friday noon. Thick smoke was reported on S8 coach in which fire broke out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X