వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో మావోయిస్టు అగ్రనేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Maoists top leaders in NIA list
న్యూఢిల్లీ: జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో మావోయిస్టు అగ్రనేతలు చేరారు. ఇప్పటి వరకు ఉగ్రవాదం పైనే దృష్టి సారించిన ఎన్ఐఏ తీవ్రవాదంపై కూడా దృష్టి సారించింది. తాజాగా తమ మోస్ట్ వాంటెడ్ జాబితాలో మావోయిస్టు అగ్రనేతలు గణపతి, కేశవ రావు, దేవ్ జీ తదితరుల పేర్లను పెట్టింది.

మావోయిస్టు అగ్రనేత గణపతి పైన 11 సెక్షన్ల కింద కేసును నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో అమెరికా నుండి ఆయుధాల దిగుమతి, ఆయుధాల తయారీ, ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా తదితరాల కింద కేసును నమోదు చేశారు. మావోయిస్టులపై ఎన్ఐఏ కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి. బలిమెల ఘటన, ఆయుధాల రవాణా కేసుల్లో కేశవ రావును ఈ జాబితాలో చేర్చినట్లు ఎన్ఐఏ అధికారులు చెప్పారు.

మహిళా మావోయిస్టు లొంగుబాటు

ఓ మహిళా మావోయిస్టు లొంగిపోయారు. విశాఖపట్నం జిల్లా ఎస్పీ ఎదుట సదరు మావోయిస్టు మహిళ లొంగిపోయారు. బలిమెల ఘటనతో ప్రమేయమున్న సాధనపై రూ.4 లక్షల రివార్డ్ ఉంది. అనారోగ్య కారణాల వల్లనే సాధన లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఆమెపై రివార్డ్ ఉందని పోలీసులు చెప్పారు.

పేలుళ్ల స్థలాన్ని పరిశీలించిన ఎన్ఐఏ

దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ బృందం మరోసారి పరిశీలించింది. వెంకటాద్రి థియేటర్ వద్ద మొదటి పేలుడు ప్రాంతాన్ని తనిఖీ చేశారు. పేలుడు తీవ్రతకు ఎంతమేర దుకాణాలు దెబ్బతిన్నాయో పరిశీలించింది. ఓ దుకాణంలో లభించిన ఇనుప బోల్టులను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పదిమందితో కూడిన అధికారుల బృందం ఈ రోజు పర్యటించింది.

English summary
Maoists top leaders like Ganapathi, Keshav Rao and Dev Ji are in National Investigaion Agency(NIA) most wanted list now. NIA put case against Ganapathi under eleven sections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X