హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోట్లు సంపాదించారు, జగన్ ఆస్తులు పంచాలి: సర్వే

By Pratap
|
Google Oneindia TeluguNews

Survey Satyanarayana
హైదరాబాద్: తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోట్లు సంపాదించారని, జగన్ ఆస్తులను పేదలకు పంచిపెట్టాలని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షారాలు సోనియా గాంధీ వల్లనే ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఆయన శనివారం మీడియాతో అన్నారు.

తెలంగాణకు సోనియా గాంధీ సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు డెడ్‌లైన్లు ఏవీ లేవని, తెలంగాణ త్వరలోనే వస్తుందనే ఆశ ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఎపిసోడ్ ముగిసిపోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తూనే ఉన్నదని ఆయన అన్నారు.

తెలంగాణ ఇస్తామనే హామీని నెరవేర్చడానికే తమ పార్టీ అధిష్టానం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతోందని ఆయన చెప్పారు. అయితే తెలంగాణ ఎప్పటిలోగా వస్తుందనే విషయం మాత్రం చెప్పలేమని అన్నారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు అనేవి ప్రతిపక్షాల ఆలోచన మాత్రమేనని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ ఉప ప్రధాని పదవి చేపడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. యుపిఎ మాత్రం 2014లోనే ఎన్నిలకు వెళ్లాలని అనుకుంటోందని సర్వే చెప్పారు.

English summary
Union Minister Survey Satyanarayana suggested that YSR Congress president YS Jagan properties should be distributed among poor. He said that Sonia Gandhi is not against Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X