వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీకి శవయాత్రనే: ములాయంతో బేనీ కొత్త పంచాయతీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mulayam Singh Yadav-Beni Prasad Verma
బలారంపూర్: తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్‌ను కేంద్ర మంత్రి పి. చిదంబరం దారిలో పెట్టారో లేదో కొత్త పంచాయతీ వచ్చి పడింది. గతంలో ములాయంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మరో కేంద్ర మంత్రి బేనీ ప్రసాద్ వర్మ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. లోకసభ ఎన్నికల్లో ఎస్పీకి నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని, ఎస్పీకి శవయాత్ర తప్పదని ఆయన అన్నారు.

తమ కాంగ్రెసు పార్టీ ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లకు పోటీ చేస్తుందని, వాటిలో 40 సీట్లు గెలుస్తుందని బేనీ ప్రసాద్ వర్మ తాజాగా అన్నారు. బిజెపికి పది సీట్లను కూడా దక్కనీయమని ఆయన అన్నారు. బిఎస్పీ మాయావతి 36 సీట్లు గెలుస్తారని ఆయన శనివారం అన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఏయే రాజకీయ పార్టీలు ఏ విధమైన ఫలితాలు సాధిస్తాయో ఆయన వివరించారు.

ములాయంకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని గతంలో బేనీ ప్రసాద్ వర్మ ఆరోపించిన విషయం తెలిసిందే. బేనీ ప్రసాద్ వర్మ చేత రాజీనామా చేయించాలని ములాయం సింగ్ యాదవ్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసినప్పుడు డిమాండ్ చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ జోక్యం చేసుకుని ములాయం సింగ్ యాదవ్‌తో మాట్లాడారు. దీంతో బేనీ ప్రసాద్ వర్మ తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు.

యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించే ఆలోచన తమకు ప్రస్తుతానికి లేదని ములాయం సింగ్ యాదవ్ శుక్రవారంనాడు చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీకి 22 మంది పార్లమెంటు సభ్యులున్నారు. యుపిఎకు వీరి మద్దతు అత్యంత కీలకం.

English summary
Firing a fresh salvo at Samajwadi Party, Union minister Beni Prasad Verma has said that Mulayam Singh Yadav's party will win only four seats in the Lok Sabha polls and there will be a "funeral procession for the party".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X