వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చావుకు పోయి పెళ్లి మంత్రాలు: కెసిఆర్‌పై నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao - Narayana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం మండిపడ్డారు. సిపిఐ వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రలో టిడిపితో పొత్తు పెట్టుకుంటుందని కాబట్టి ఆ పార్టీతో ఇక్కడ పొత్తులుండవని, తెరాస ఒంటరిగానే పొత్తులు లేకుండా పోటీ చేస్తుందని శనివారం చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై నారాయణ తీవ్రంగా స్పందించారు.

కెసిఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని చెడగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. అందరు కలిసి పోటీ చేసినప్పుడు తెరాసకు ఎన్ని సీట్లు వచ్చాయో కెసిఆర్‌కు అనుభవమేనని ఎద్దేవా చేశారు. కెసిఆర్ తీరు చావుకు పోయి పెళ్లి మంత్రాలు చదివినట్లుగా ఉందని విమర్శించారు. ఆయనవి అసందర్భ ప్రేలాపనలు అన్నారు. ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి పొత్తులు, ఎత్తులు ఉంటాయని నారాయణ చెప్పారు.

రాష్ట్రంలో ఓ వైపు విద్యుత్ సమస్యతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని మరోవైపు తెలంగాణ రాక తెలంగాణ ప్రజలు ఆవేదనతో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ ఇలాంటి మాటలు మాట్లాడం విడ్డూరమన్నారు. అవి అసందర్భ ప్రేలాపనలేనని విమర్శించారు. పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు.

కాగా, వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తులుండవని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సిపిఐ ఆంధ్రలో తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశముందని కాబట్టి ఇక్కడ సిపిఐతో కలిసి పని చేసే ప్రసక్తి లేదన్నారు. సర్వేలు అన్ని తెరాసకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీతోను పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

English summary
CPI leader Narayana lashed out at TRS chief K Chandrasekhar Rao for his comments on alloys in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X