గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు హక్కు లేదు: అంబటి, జగనొస్తాడు: రవీంద్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu-Ravindranath Reddy
గుంటూరు/అనంతపురం: విద్యుత్తు చార్జీల పెంపుపై పోరాటం చేసే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్తు ఉద్యమంలో ముగ్గురి చావుకు చంద్రబాబు కారణమయ్యారని ఆయన సోమవారం గుంటూరులో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇప్పుడు చంద్రబాబు విద్యుత్ సంక్షోభంపై ఉద్యమం చేస్తానని అనడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే బెయిల్ వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రజా సమస్యల కన్నా ప్రభుత్వాన్ని కాపాడడమే ముఖ్యమని ఆయన విమర్శించారు. ఒక్క రూపాయి కూడా పన్ను భారం వేయని ఘనత దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని ఆయన అన్నారు. ఎన్ని ఉద్యమాలు చేసినా స్పందించని దున్నపోతు ప్రభుత్వం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు.

లారీ యజమానులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, అనంతపురం శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి రద్దు చేసిన లోడ్, అన్‌లోడ్ తిరిగి వసూలు చేస్తుండడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ పార్టీ ఎమ్మెల్యేల నిరాహార దీక్ష

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో వీరు దీక్షలో పాల్గొంటారు. రేపు మంగళవారం ఉదయం 8 గంటలకు లోటస్‌పాండులో శానససభ్యులు సమావేశమవుతారు.

ఆ తర్వాత హైదరాబాదులోని పంజాగుట్ట చేరుకుని వైయస్సార్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత బషీర్‌బాగ్ విద్యుత్తు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి దీక్షాస్థలికి చేరుకుంటారు. ఉదయం ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభిస్తారు.

English summary
YSR Congress party leader Ambati Rambabu said that Telugudesam president Nara Chandrababu has no right to take up agitation on power tariff hike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X