వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ జగన్ బలం!: విజయమ్మ దీక్షలో ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆధ్వర్యంలో చేపట్టిన కరెంట్ సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంగళవారం విజయమ్మ ఆధ్వర్యంలో జగన్ పార్టీ విద్యుత్ సమస్యలపై ఆమరణ దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇటీవల అవిశ్వాస తీర్మానం సమయంలో జగన్ వైపుకు వెళ్లిన వారు పలువురు హాజరయ్యారు.

ఈ దీక్షలో కాంగ్రెసు ఎమ్మెల్యేలు పేర్ని నాని, ఆళ్ల నాని, మద్దాల రాజేష్, సుజయ కృష్ణ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, జోగి రమేష్, గొట్టిపాటి రవికుమార్, కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యుడు కూన శ్రీశైలం గౌడ్‌లు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ ధిక్కార ఎమ్మెల్యేలు తంబళ్లపల్లి ప్రవీణ్ కుమార్ రెడ్డి, శిరియా సాయిరాజ్, వనిత, అమర్నాథ్ రెడ్డి, కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, జగన్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ దంపతులు కూడా పాల్గొన్నారు.

జగన్ పార్టీ ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, తెల్లం బాలరాజు, సుచరిత, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, కాపు రామచంద్ర రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, భూమా శోభానాగి రెడ్డిలు పాల్గొన్నారు. శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకర రావు, మేకా శేషు బాబు, దేశాయి తిప్పారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావులు పాల్గొన్నారు.

విజయమ్మ దీక్షకు లెఫ్ట్ మద్దతు

విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఆమరణ దీక్ష చేపట్టిన వైయస్ విజయమ్మకు మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు చెప్పారు. ఈ నెల 9వ తేదిన తలబెట్టిన బందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.

English summary
27 MLAs and four MLCs participated in YSR Congress Party honorary president and Pulivendula MLA YS Vijayamma's deeksha on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X