వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దొంగే దొంగలా విజయమ్మ దీక్ష: వైయస్ డబ్బు లెక్కిస్తే'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్ష చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం ఆరోపించారు. ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విధానాలే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైయస్ కుటుంబ సభ్యులు స్థాపించిన పార్టీయే విద్యుత్ పైన దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

దొంగే దొంగ అన్నట్లుగా విజయమ్మ, ఆ పార్టీ నేతల దీక్ష ఉందని ఎద్దేవా చేశారు. విద్యుత్ సంక్షోభం విషయంలో ఈ నెల 9వ తేది వరకు తెలుగుదేశం పార్టీ సంతకాల సేకరణ చేపడుతుందన్నారు. టిడిపి, కాంగ్రెసు హయాంలోని విద్యుత్ పైన తాము ప్రజల ముందుకు వెళ్తామన్నారు. 2004 వరకు దేశంలోనే రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి బాగుండిందన్నారు. దేశంలోనే అత్యుత్తమంగా విద్యుత్ అందించామన్నారు.

కాంగ్రెసు తన తొమ్మిదేళ్ల పాలనలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు టిడిపి తమ ఆందోళనను విరమించే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. విద్యుత్ కోత కారణంగా రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు.

విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ నుండి, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన సోమిరెడ్డి మండిపడ్డారు. తమ నుండి నేర్చుకోవాలని కిరణ్‌ను తాము కోరలేదన్నారు. విద్యుత్ సంక్షోభంపై ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఎందుకు సమీక్షంచరని ప్రశ్నించారు. విద్యుత్ సమస్యపై సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదన్నారు. అప్పుడు వైయస్ డబ్బులు లెక్కించుకుంటే ఇప్పుడు కిరణ్ ఎమ్మెల్యేలను లెక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు.

English summary
Telugudesam Party senior leader Somireddy 
 
 Chandramohan Reddy has blamed YSR Congress party 
 
 honorary president YS Vijayamma for her deeksha and 
 
 CM Kiran Kumar Reddy for power crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X