వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నడవలేని స్థితిలో శ్రీలక్ష్మి: చంచల్‌గూడ నుండి విడుదల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srilakshmi
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితురాలు, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సోమవారం దయనీయస్థితిలో జైలు నుండి బయటకు వచ్చారు. సోమవారం సాయంత్రం ఆమె జైలు నుండి విడుదలయ్యారు. అప్పుడు ఆమె జైలు గడప కూడా దాటలేని స్థితిలో ఉన్నారు. సాయంత్రం ఆమెను గేటు బయటకు జైలు సిబ్బంది ఎత్తుకొని వచ్చారు.

ఆ తర్వాత ఆమె భర్త గోపీకృష్ణ, మరో పోలీసు సహాయంతో శ్రీలక్ష్మిని కారులో కూర్చోబెట్టారు. కుడి చేయి, కాలు స్పర్శ కోల్పోవడంతో కారు వెనుక సీటులో కూర్చునేందుకు ఆమె తీవ్ర అవస్థ పడ్డారు. చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీలక్ష్మికి శనివారమే షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంపాలైన ఆమె సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు.

మరోవైపు గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ జడ్జి పట్టాభిరామారావు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. జడ్జిగా పని చేసిన కోర్టుకే నిందితుడిగా వెళ్లడంతో తీవ్రంగా మథనపడ్డారు. దీంతో పలు ఆరోగ్య సమస్యలు ఆయన్ని చుట్టుముట్టాయి.

గుండె రక్తనాళాలు మూసుకుపోయాయని, ఆపరేషన్ అనివార్యమని వైద్యులు చెప్పారు. దీంతో సోమవారం ఇక్కడి ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో పట్టాభి రామారావుకు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ మరో రెండు రోజులు అత్యవసర విభాగంలో ఉంచాల్సిందిగా వైద్యులు సూచించారు.

English summary
Suspended IAS officer Y Srilakshmi, an accused in the Obulapuram illegal mining case, was released on bail from the Special Prison for Women at Chanchalguda on Monday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X