• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కార్లో నుండి అక్కను తోసేసి బార్ డ్యాన్సర్‌ను ఎత్తుకెళ్లి...

By Srinivas
|

Bar dancer kidnapped
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణాలు అగడం లేదు. ఓ బార్‌లో డ్యాన్సర్‌గా ఉంటున్న యువతిపై ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో తీసుకు వెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన 35 ఏళ్ల యువతి, ఆమె అక్కతో కలిసి ఢిల్లీలోని గూర్గావ్‌ పరిసర ప్రాంతంలో నివసిస్తున్నారు.

ఇరువురు గుర్గావ్‌లోని ఓ బార్‍‌లో డ్యాన్సర్‌లుగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి విధులు ముగించుకొని బార్ వెలుపలికి వచ్చిన వారిని ఓ ఇండిగో క్యాబ్ డ్రైవర్ ఉచితంగా ఇంటి వద్ద దింపుతానని, తాను కూడా అటే వెళ్తున్నానని చెప్పి వారిని నమ్మించి తన కారులోకి ఎక్కించుకున్నాడు.

అయితే, కారును అతను మరోవైపుకు మళ్లించాడు. ఈ క్రమంలో అప్పటికే కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు మధురా రోడ్డు, ఓక్లా ట్యాంకు వద్ద బాధితురాలి అక్కను బలవంతంగా కారులో నుంచి కింద పడేశారు. బాధితురాలని షబీన్ బాగ్‌లోని ఓ ప్రాంతానికి తీసుకు వెళ్లారు.

అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున బాధితురాలి నివాసం వద్ద ఆమెను నిందితులు వదిలేసి వెళ్లిపోయారు. మరోవైపు అక్క పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు బాధితురాలిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించారు. నిందితులపై అపహరణ, అత్యాచారం కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిన విషయాన్ని పోలీసులు నిర్ధారించారు.

English summary

 A bar dancer from Odisha was kidnapped and beaten by three men in South Delhi on Saturday Night. Police filed a complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X