వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ పనైపోయింది!: అలకవీడిన బిలావల్, పిపిపి ఆనందం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bilawal Bhutto
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తనయుడు బిలావర్ భుట్టో అలక వీడారు. ఇటీవల తండ్రిపై అలక వహించిన బిలావల్ తనకు అవకాశం వస్తే పిపిపికి ఓటు వేయనని చెప్పి విదేశాలకు వెళ్లారు. ఆ తర్వాత రెండు రోజుల క్రితం తిరిగి వచ్చాడు. ప్రస్తుతం పిపిపి ప్రధాన ప్రచారాస్త్రం బిలావల్.

అలాంటి బిలావల్ అలక వహించడంతో ఆ పార్టీకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే, బిలావల్‌ను బుజ్జగించడంలో కుటుంబ సభ్యులు, పార్టీ సఫలమైంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు బిలావల్ ఒప్పుకున్నారు. బిలావల్ సోమవారం రాత్రి తిరిగి కరాచీకి వచ్చారని, అతను పార్టీ ప్రచార బాధ్యతలు తీసుకుంటారని, అన్ని సమస్యలు సమసిపోయాయని పిపిపికి చెందిన ఓ నేత చెప్పారట.

కాగా, పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తనయుడు బిలావర్ భుట్టో తన తండ్రిపై అలిగి ఇటీవల దుబాయ్ ఫ్లైట్ ఎక్కిన విషయం తెలిసిందే. మరో నెలన్నరలో పాక్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా తన పార్టీకే ఓటేసేది లేదని అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) ప్రధాన పరిరక్షకుడు (పాట్రన్-ఇన్-చీఫ్) బిలావల్ తన తండ్రి అసిఫ్ అలీ జర్దారీకి తెగేసి చెప్పడం విశేషం. పార్టీ వ్యవహారాలలో తండ్రితోపాటు సోదరి ఫర్యాల్ తాల్పూర్ తన మాటకు విలువ ఇవ్వడం లేదంటూ అలిగిన బిలావల్ దుబాయ్ వెళ్లిపోయారు.

బిలావల్‌ను తమ ప్రధాన ప్రజాకర్షక ప్రచారకుడుగా భావిస్తున్న పార్టీ నేతలు ఈ పరిణామంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పిపిపిలో ముసలం ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక, యువత సమస్యల పట్ల పార్టీ స్పందనల తదితర విషయాలలో పార్టీ అనుసరిస్తున్న తీరుపై బిలావల్‌కు, జర్దారీకి విభేదాలు తలెత్తాయి. తన సూచనలు బేఖాతరు చేయడాన్ని నిరసిస్తూ ఇరవై నాలుగేళ్ల బిలావల్ దుబాయ్‌కి వెళ్లిపోయాడు.

ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా భావిస్తున్న బిలావల్ వెళ్లిపోడంతో సంప్రదాయ ఓట్ బ్యాంకు దూరమయ్యే ప్రమాదం నెలకొందని పార్టీ వర్గాలు ఆందోళన చెందాయి. పార్టీ వ్యవహారాల్లో తనను పక్కన పెట్టి సోదరి ఫర్యాల్ సూచనలకు జర్దారీ ప్రాధాన్యం ఇవ్వడం సహించలేకపోయాడు. సింధ్ రాష్ట్రంలో బిలావల్ సూచించిన అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చేందుకు ఆయన సోదరి అడ్డుపడ్డారు. ఈ వ్యవహారంలో జర్దారీ తన కుమార్తెను సమర్థించారు. దీంతో బిలావల్ అలిగాడు.

మరింత రాజకీయ పరిణితి చెందిన తర్వాత బాధ్యతలు అప్పగిస్తానని జర్దారీ చెప్పినా బిలావల్ వినలేదు. తనకు అవకాశం వస్తే పిపిపికి ఓటు వేయబోనని చెప్పి మరీ వెళ్లిపోయాడు. అయితే, అప్పడు విభేదాల వార్తలను గిలానీ కొట్టిపారేశారు. తమ కుటుంబాల్లో పిల్లలు పెద్దలను గౌరవిస్తారన్నారు. అయితే, అలిగి వెళ్లిన బిలావల్ తిరిగి రావడమే కాకుండా ఇప్పుడు పార్టీ ప్రచార బాధ్యతలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉండటం ఆ పార్టీలో హర్షాతిరేకాలు నింపుతోంది.

English summary
Pakistan president Asif Ali Zardari and other family members at last succeeded in convincing Bilawal Bhutto Zardari, the young chief of Pakistan people's party, to lead the party's election campaign as he returned from Dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X