వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగాది రోజు తెలుగు వికీపిడియా మహోత్సవం

By Pratap
|
Google Oneindia TeluguNews

 Wikipedia Mahotsavam on April 11
హైదరాబాద్: వికిపిడియా సేకరిస్తున్న విజ్ఞాన భాండాగారాన్ని తెలుగు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలుగు వికిపిడియా, థియేటర్ ఔట్రిచ్ యూనిట్ , హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో 11వ తేదీన ఉగాది పర్వదినంనాడు తెలుగు వికిపిడియా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు రహ్మనుద్దీన్ తెలిపారు.

11వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ గోల్డెన్ థ్రెసోల్డ్ ప్రాంగణంలో జరుగుతుందని ఆయన చెప్పారు. వికీ చైతన్య వేదిక సందర్భంగా అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ గోల్డెన్ ధ్రెసోల్డ్ ప్రాంగణంలో వికీ అకాడమిని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ప్రపంచ విజ్ఞాన సర్వస్వాన్ని తేట తెలుగు నుడికారంతో తెలుగు ప్రజలకు పూర్తి ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో సాగుతున్న ఈ అక్షరయజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. 2001 జనవరి 15న ప్రారంభమైన వికిపి డియా ప్ర పంచ వ్యా ప్తంగా నేటికి 285 భాషల్లో 3 కోట్ల 63 లక్షల 46వేల 838 వ్యాసాలతో పురోగమిస్తోందని అన్నారు.

భారతీయ భాషల్లో దాదాపు అన్ని భాషల్లో వికిపిడియా పనిచేస్తోందని, తెలుగులో 2003 డిసెంబర్ 10న ప్రారంభమైందని అన్నారు. తెలుగులో ప్రస్తుతం 51వేల 457 వ్యాసాలు ఉన్నాయని చెప్పారు.

English summary

 Wikipedia mahotsavam will be held on Ugadi on april 11. Rahmnuddin told that public will be enlightened on Telugu wikipedia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X