విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనోడే: జగన్ పార్టీకి కౌంటర్‌గా 'బాద్ షా'కి టిడిపి పట్టం

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఇటీవల రెండుమూడు సందర్భాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కనిపించి బెజవాడ రాజకీయాల్లో వేడి పుట్టించిన విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తొలగించి చర్చకు తెరపడేసే ప్రయత్నాలు చేశారు కూడా. తాజాగా బెజవాడ తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో హల్ చల్ చేస్తున్నాయి. జూనియర్ నటించిన బాద్ షా చిత్రం రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద, నగరంలోని పలుచోట్లు టిడిపి నేతలు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను వైయస్సార్ కాంగ్రెసు పెట్టుకున్నందుకు కౌంటర్‌గానా అన్నట్లుగా కార్యకర్తలు చాలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జూనియర్ తమ వాడే అని చెప్పుకునేందుకు పెట్టినట్లుగా ఉందంటున్నారు. పడమట లంకలో తెలుగు యువత పేరుతో టిడిపి కార్యకర్తలతో పాటు నందమూరి అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Baadshah

కాగా, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను మచిలీపట్నం, విజయవాడలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీలలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫ్లెక్సీలలో జూనియర్‌తో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వైయస్ జగన్, వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ విజయమ్మ తదితరుల ఫోటోలు పొందుపర్చారు. ఇవి వివాదం రేపిన విషయం తెలిసిందే.

English summary
Telugudesam Party activists and Nandamuri fans were arranged big flexees in Vijayawada regarding Jr NTR's Baadshah release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X