వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు ఉపాధ్యాయ అక్కాచెల్లెళ్లపై యాసిడ్ దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Acid attack on four sisters
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో నలుగురు అక్కాచెల్లెళ్లపై యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడిని తొలిసారిగా ప్రత్యేక నేరంగా పరిగణిస్తూ కేంద్రం కొత్త చట్టం అమల్లోకి తెచ్చిన రోజే యుపిలో షమిలి జిల్లాలో ఈ అక్కాచెల్లెళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. నలుగురు అక్కాచెల్లెళ్లు పాఠశాల నుండి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. ఇందులో ముగ్గురు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినులుగా పని చేస్తున్నారు.

మంగళవారం వీరు కంధాల్‌లోని హింద్ ఇంటర్ కళాశాలలో యుపి బోర్డు పరీక్ష విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు యాసిడ్‌తో దాడి చేశారు. ఆ తర్వాత వారు అక్కడి నుండి పారిపోయారు. ఇద్దరు వ్యక్తులు అక్కాచెల్లెళ్లపై యాసిడ్‌తో దాడి చేసి ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయారని స్థానిక పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో కమజ్ జహాన్(26), ఆయేషా(25), ఇషా(23), సనమ్(20)లు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద సోదరికి అందరికంటే ఎక్కువ గాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇషా ఎడమ కన్ను బాగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. యాభై శాతం కంటే కొద్దిగా తక్కువగా వారి శరీరం కాలింది. శత్రువులు లేనందున, గతంలో ఎవరు తమను వేధింపులకు గురి చేయనందున తమపై దాడి చేసిందెవరో అక్కాచెల్లెళ్లు తేల్చుకోలేకపోతున్నారు.

నలుగురిలో ఒక సోదరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. మిగిలిన ముగ్గురికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. యాసిడ్ దాడి చేసిన వారికి 8 నుండి 12 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇందులో బెయిల్ లభించే అవకాశాలు ఉన్నాయి.

English summary

 Two motorcycle-borne youths threw acid on four sisters, all schoolteachers, in the Kandhla area of Shamli district of Uttar Pradesh on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X