వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు మెర్సీ పిటిషన్లను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ఘోరమైన నేరాలకు పాల్పడిన ఏడుగురికి సంబంధించి ఐదు క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తోసిపుచ్చారు. ఐదు కేసుల్లో మరణ శిక్షకు, రెండు కేసుల్లో జీవిత ఖైదుకు సంబంధించిన మెర్సీ పిటిషన్లను ఆయన తోసిపుచ్చారు.

కసబ్, అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్లను ఆయన ఇంతకు ముందు తోసిపుచ్చారు. దాంతో వారిద్దరికి మరణ శిక్ష అమలు జరిగింది. ప్రస్తుతం ఐదు క్షమాభిక్ష పిటిషన్లను ఆయన తోసిపుచ్చడంతో ఇక అటువంటి పిటిషన్లు ఆయన వద్ద పెండింగులో లేవని తెలుస్తోంది. ఈ కింది మెర్సీ పిటిషన్లను రాష్ట్రపతి తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.

- 1986 ఆగస్టు 17వ తేదీన ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని హత్య చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుర్మీత్ సింగ్ దోషిగా తేలాడు.

- హర్యానాకు చెందిన ధర్మపాల్ ఓ అమ్మాయిని రేప్ చేసి ఆమె కుటుంబానికి చెందిన ఐదుగురిని 1993లో హత్య చేశాడు.

- హిస్సార్‌లో 2001లో హర్యానా మాజీ ఎమ్మెల్యే కూతురు సోనియా, ఆమె భర్త సంజీవ్ ఆమె కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని చంపారు.

- ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేష్, రాంజీ తమ సోదరుడి కుటుంబసభ్యులను ఐదుగురిని హత్య చేశారు.

ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షమాభిక్ష పిటిషన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు అర్థమవుతోంది.

English summary
After Ajmal Kasab and Afzal Guru, President Pranab Mukherjee rejected mercy petitions in five cases and commuted death sentence to life term in two other cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X