వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు వర్గం మంత్రి అసంతృప్తి: రాజకీయమన్న దానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah - Danam Nagendra
హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల తగ్గుదల విషయంలో మధ్య తరగతి, పరిశ్రమలను పరిగణలోకి తీసుకుంటే బాగుండేదని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య శుక్రవారం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు వందల యూనిట్ల లోపు కాల్చిన వారికి పాత విద్యుత్ ఛార్జీలే ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై రామచంద్రయ్య స్పందించారు. విద్యుత్ కోతలు, ఛార్జీల పెంపు వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కోతలు, ఛార్జీల పెంపు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే అవకాశముందని అన్నారు. విద్యుత్ కోతలను తగ్గించే అంశం పైన ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. అధికారులు చెబుతున్నట్లుగా విద్యుత్ సరఫరా కావడం లేదని అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గినా మధ్య తరగతితో పాటు పరిశ్రమలను పరిగణలోకి తీసుకుంటే బాగుండేదన్నారు.

ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశ్యంతోనే ఈ నెల 9వ తేదిన విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బందుకు పిలుపునిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. పేద ప్రజల పైన విద్యుత్ భారం పడవద్దన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్షాల విమర్శల్లో అర్థం లేదన్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9న తలపెట్టిన బందుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కోరారు. రాష్ట్ర బందుకు సంబంధించి వాల్ పోస్టర్‌ను వామపక్ష నేతలు విడుదల చేశారు. రాయితీల పేరుతో కంత్రీ లెక్కలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు.

English summary
Endowment Minister C Ramachandraiah has expressed his unhappy on happy with Kiran Kumar Reddy government over power charges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X