విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్లెక్సీ కత్తిరింపు: నానిపై రావి ఫైర్, విశాఖ ఫ్లెక్సీలో ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raavi Venkateswara Rao-Kodali Nani
విజయవాడ/విశాఖపట్నం: కృష్ణా జిల్లా విజయవాడలో ఫ్లెక్సీ రాజకీయం తగ్గటం లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఫ్లెక్సీలో హీరో జూనియర్ ఎన్టీఆర్ రాద్దాంతం కొనసాగుతూనే ఉంది. తాజాగా గుడివాడలో ఓ ఫ్లెక్సీలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ రావి వెంకటేశ్వర రావు ఫోటోను ఫ్లెక్సీలో నుండి కత్తిరించారు. టిడిపి నేతలతో రావి వర్గం ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది.

ఈ ఫ్లెక్సీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి చెందిన థియేటర్ ఎదుట ఉంది. ఇందులో రావి ఫోటోను కత్తిరించారు. వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్ర శనివారం గుడివాడకు చేరుకుంటుంది. ఇదే సమయంలో ఫ్లెక్సీ చిచ్చు రాజుకుంటుండటం ఇరు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

టిడిపి ఫ్లెక్సీలో తమ నేత ఫోటోను కొడాలి నాని వర్గీయులే కత్తిరించి ఉంటారని రావి వెంకటేశ్వర రావు వర్గం ఆరోపిస్తోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో పెట్టుకోవడం వల్ల షర్మిల పాదయాత్రకు ప్రజలు వస్తున్నారని, ఆయన ఫోటో తీసి అప్పుడు వచ్చే జనాన్ని చూపించాలని రావి వెంకటేశ్వర రావు సవాల్ విసిరారు. కొడాలి నాని చీఫ్ ట్రిక్ మానుకోవాలని హితబోధ చేశారు.

విశాఖలో జగన్‌తో జూనియర్.. టిడిపి ఆందోళన

జగన్ పార్టీ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో చిచ్చు విశాఖకు కూడా పాకింది. విశాఖ కిన్నెర థియేటర్ వద్ద జగన్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఏర్పాటు చేశారు. అందులో టాలీవుడ్ బాద్ షా ఎన్టీఆర్... పొలిటికల్ బాద్ షా జగన్ అని రాశారు. కింద రాజకీయాలకు అతీతంగా అంటూ ట్విస్ట్ ఇచ్చారు. టిడిపి అభిమానులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ ఫోటో తొలగించాలని డిమాండ్ చేశారు. థియేటర్ యాజమాన్యం దిగి వచ్చి ఫ్లెక్సీని తొలగించింది.

English summary
Gudiwada Telugudesam Party incharge Raavi Venkateswara Rao has lashed out at MLA Kodali Nani for tear his photo in TDP flexi on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X