కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాద్ షా క్యూలైన్లో తొక్కిసలాట: జూ ఎన్టీఆర్ ఫ్యాన్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Baadshah
కర్నూలు: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమాకు సంబంధించి మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. బాద్ షా సినిమా టికెట్ల క్యూలైన్‌లో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో జూనియర్ ఎన్టీార్ అభిమాని ఒకతను మరణించాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా డోన్‌లోని శేషు థియేటర్ వద్ద చోటు చేసుకుంది. దాంతో అక్కడ విషాదం నెలకొంది.

జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన బాద్ షా సినిమా శుక్రవారం విడుదలయింది. ఈ సందర్భంగా సినిమా టికెట్ల కోసం అభిమానులు పెద్ద యెత్తున టికెట్ల కోసం తరలి వచ్చారు. దాంతో ఆ విషాద సంఘటన చోటు చేసుకుంది. సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించాడు.

ఇదిలావుంటే, హైదరాబాదులోని అంబర్‌పేటలో గల శ్రీరమణ థియేటర్‌లో బాద్‌షా సినిమా ప్రదర్శనను మధ్యలో ఆపేశారు. థియేటర్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో సినిమా ప్రదర్శనను మధ్యలో ఆపేసి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.

ఇటీవల బాద్ షా ఆడియో విడుదల సందర్భంగా హైదరాబాదులో ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన రాజు అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తొక్కిసలాటలో మరణించిన విషయం తెలిసిందే. మణికొండలోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుకలు ఏర్పాటయ్యాయి. ఈ వేడులకు జూ. ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో వరంగల్‌లోని ఉరుసుగుట్టకు చెందిన రాజు అనే అభిమాని ఊపిరి ఆడక మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ సంఘటనపై తీవ్రమైన వివాదం చెలరేగింది. ఏర్పాట్లు సరిగా చేయకపోవడం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని నిర్వాహకులపై పోలీసులు విరుచుకపడ్డారు. నిర్వాహకుల వాదన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అభిమాని మృతికి నిరసనగా తెలంగాణలో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి హెచ్చరించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు బండ్ల గణేష్ మృతుడి కుటుంబానికి పెద్ద యెత్తున నష్టపరిహారం చెల్లించారు.

English summary
Jr NTR fan has dead at Done of Kurnool district in stampede at a cinema theatre during the release of Baadshah film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X