హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉర్దూ మహాసభలు పెడతాం: సిఎం, ఆరోగ్యశ్రీపై సమీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల మాదిరిగానే ఉర్దూ మహాసభలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. శనివారం హైదరాబాద్ నగరంలో జరిగిన ఉర్దూ హెరిటేజ్ కార్వాన్‌లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

బడ్జెట్‌లో మైనార్టీలకు రూ.1027 కోట్లు కేటాయించామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తెలుగు, ఉర్దూ విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోవడం వల్లే, ఇంగ్లీష్ మీడియంవైపు మొగ్గు చూపుతున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆస్పత్రులకు హెచ్చరిక...

ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సచివాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కొండ్రు మురళి, ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపివేస్తే చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ సీఈవో శ్రీకాంత్ హెచ్చరించారు.

ప్రైవేటు ఆస్పత్రుల డిమాండ్లను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. శనివారం ఉదయం సచవాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పై సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

రేపు ఢిల్లీకి కిరణ్ రెడ్డి..

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి రేపు(ఆదివారం) ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆదివారం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సమావేశం కానున్నారు. సీఎం కిరణ్ ఈ సమావేశంలో పాల్గొంటారు.

English summary
CM Kiran Kumar Reddy said that Urdu conference will be held like Telugu world conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X