హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్‌పై దాడి సాగిస్తే జగన్ పార్టీలోకి: సుధీర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sudheer Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు నాయకులు విమర్శించడం మానకపోతే ఎన్నికల ముందు పార్టీలో చేరినవారంతా వెళ్లిపోతారని శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దూతగా వచ్చిన అమర్ కాలేకు చెప్పారు. గాంధీభవన్‌లో రాహుల్ దూత అమర్‌కాలేను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సోమవారం కలుసుకున్నారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన నేతల జాబితాను అమర్‌ కాలేకు సుధీర్ రెడ్డి అందించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ఇంకా ఎవరెవరు వెళ్తారని అమర్‌కాలే సుధీర్ రెడ్డిని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించేవారిని కట్టడి చేయకపోతే పార్టీని వీడే అవకాశముంటుందని ఆయన జవాబిచ్చారు.. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చేవారికి టికెట్టు ఇవ్వొద్దని ఆయన కోరారు. వైఎస్‌ను విమర్శిస్తున్న వారిని అదుపులో పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టమని అమర్‌కాలేకు సుధీర్ రెడ్డి చెప్పారు.

గాంధీభవన్‌లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలతో రాహుల్ దూత అమర్‌కాలే సోమవారం ఉదయం సమావేశమయ్యారు. మంత్రి ప్రసాద్‌కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. చేవెళ్ల, మల్కాజగిరి స్థానాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ సమస్యను తేల్చకపోతే పార్టీ పరిస్థితి బాగుండదని కాంగ్రెసు శానససభ్యుడు రాజేందర్ అమర్ కాలేతో చెప్పారు. తెలంగాణ సమస్యను త్వరగా తేల్చాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెసురకు తిరుగు ఉండదని, ఎవరిని అభ్యర్థులుగా దించినా గెలుస్తారని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి చెప్పారు.

హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి అమర్ కాలేతో సమావేశమయ్యారు. కాగా, జైపాల్ రెడ్డిపై చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెసు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. విజయం సాధించిన తర్వాత జైపాల్ రెడ్డి చేవెళ్లకు రాలేదని వారు చెప్పారు. ఈసారి జైపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని వారు కోరారు.

English summary
Congress MLA Sudhir Reddy told to AICC vice president Rahul Gandhi's emissinary that if party leaders continue to criticize YS Rajasekhar Reddy most of the first time MLAs will hump into YS Jagan's YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X