• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమ్మలో కమ్మదనం, పెళ్లిళ్లు కష్టంగా మారాయి: మోడీ

By Srinivas
|

Narendra Modi
న్యూఢిల్లీ: భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. ఆయన న్యూఢిల్లీలో ఫిక్కీ మహిళా విభాగం వార్షిక సదస్సులో ప్రసంగించారు. 'మహిళా పారిశ్రామికవేత్తలు - నూతన మార్గాలు' అనే అంశంపై మోడీ మాట్లాడారు. సామాజిక వెబ్‌సైట్ల కారణంగా తాను చాలామంది సోదరీమణులతో అభిప్రాయాలను పంచుకున్నానని మోడీ చెప్పారు.

అమ్మ అనే పిలుపులోనే ఎంతో కమ్మదనముందన్నారు. స్వచ్ఛతకు మారుపేరు అమ్మ అన్నారు. అందుకే మన దేశంలో మహిళలకు, అమ్మలకు సముచిత స్థానముందని చెప్పారు. భారత్ సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అన్నారు. ప్రస్తుతం మహిళలపై దాడులు చూస్తుంటే మనం పద్దెనిమిదవ శతాబ్దానికంటే వెనక్కి పోయినట్లుగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 21 శతాబ్ధంలోనూ గర్భంలోనే ఆడపిల్లలను చంపివేయడం చాలా శోచనీయమన్నారు.

వృద్ధాప్యంలో తమకు ఆసరాగా నిలబడతారనే ఉద్దేశ్యంతోనే తల్లిదండ్రులు కొడుకుపై శ్రద్ధ చూపుతున్నారన్నారు. కానీ, కొడుకు కన్నా కన్నా కూతురే వృద్ధాప్యంలో ఆసరాగా నిలుస్తుందనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. సమాజంలో మహిళ పురుషుల కంటే రెండు అడుగులు ముందే ఉంటుందన్నారు. ప్రజలు తమ సలహాలను, సూచనలను తనకు ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సామాజిక వెబ్ సైట్ల ద్వారా పంపించవచ్చునని చెప్పారు.

ఆడపిల్లల సంఖ్య తగ్గిన కారణంగా పురుషులకు పెళ్లిళ్లు కావడమే కష్టంగా మారిందన్నారు. స్త్రీలకు సముచిత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ ఆస్తులు మహిళల పైనే ఉంటాయన్నారు. అవకాశం ఇస్తే వారు దూసుకు వెళ్తారని చెప్పారు. ఆధునిక భారతంలో మహిళే శక్తివంతమైనదన్నారు. కొడుకు, కూతురు మధ్య తల్లిదండ్రులు వ్యత్యాసం చూపించవద్దని కోరారు. లింగ వివక్షపై పోరాడటంలో మీడియా పాత్ర అభినందనీయమన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gujarat Chief Minister Narendra Modi's is about to address at FICCI. Will he take on Rahul Gandhi's speech made at CII on April 4?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more