వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబితకు అండ: కల్సిన టిడిపి, జగన్ వర్గం ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabiha Indra Reddy
హైదరాబాద్: సిబిఐ ఛార్జీషీటులో పేరున్న నేపథ్యంలో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలుస్తున్నారు. మంత్రులు జానా రెడ్డి, వట్టి వసంత్ కుమార్, డికె అరుణ, ఎమ్మెల్యే నల్లిమిల్లి శేషా రెడ్డిలు వేర్వేరుగా కలిశారు. డిజిపి దినేష్ రెడ్డి కూడా ఆమెతో భేటీ అయ్యారు. సబితను కలిసిన వారిలో జగన్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, టిడిపి ఎమ్మెల్యే రత్నంలు ఉన్నారు. సబిత రాజీనామాకు టిడిపి డిమాండ్ చేస్తుండగా ఆ పార్టీ ఎమ్మెల్యే కలవడం చర్చనీయాంశమైంది. అయితే, రేపటి ముఖ్యమంత్రి పర్యటన విషయమై చర్చించేందుకు వచ్చినట్లు రత్నం చెప్పారు.

ఛార్జీషీటులో పేరున్నందున సబిత రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో పాటు ఇతర పార్టీల నేతలు వారించడంతో ఆమె వెనక్కి తగ్గారు. అయితే, ఆమె రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నట్లుగా సమాచారం. సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ఆమె ప్రకటించే అవకాశం ఉంది.

సబిత తప్పు చేయలేదు... శేషా రెడ్డి

సబితను కలిసిన అనంతరం శేషా రెడ్డి మాట్లాడుతూ... సబితా ఇంద్రా రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, మైనింగ్ వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటోందని అన్నారు. తప్పు జరిగితే అప్పుడే ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఛార్జీషీటులో పేరు ఉన్నంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యేలంతా సబితకు మద్దతుగా ఉంటారన్నారు.

సబితా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు... డికె అరుణ, కన్నా

సబితా ఇంద్రా రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డికె అరుణ అన్నారు. ఆరోణలు వచ్చిన వారంతా రాజీనామా చేయాలంటే ఎందరో రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారమే హోంమంత్రి సబిత వ్యవహరించారన్నారు. సబిత తప్పు చేయలేదని, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని ఆమెకు చెప్పామన్నారు.

కిరణ్ పర్యటన వాయిదా

ఛార్జీషీటులో మంత్రుల పేర్ల నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకరపల్లి పర్యటన వాయిదా పడింది. మరోవైపు ఆయనను మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, పితాని సత్యనారాయణ, శైలజానాథ్‌లు కలిశారు.

English summary
Ministers Kanna Laxmi Narayana, DK Aruna and MLAs Alla Nani and Sesha Reddy met Home Minister Sabiha Indra Reddy on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X