వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ హయాంలో...: కెవిపిపై సూరీడు చెప్పిన నిజం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao - Sureedu
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో డీల్స్ అన్ని కెవిపి రామచంద్ర రావు ఆమోదం పొందిన తర్వాతనే ఫైనలైజ్ అయ్యేవని నాటి వైయస్ వ్యక్తిగత కార్యదర్శి సూరీడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కి చెప్పినట్లుగా తెలుస్తోంది. వైయస్ హయాంలో ప్రతి డీల్‌లోను కెవిపి హస్తం ఉండేదని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. డీల్స్ కోసం సంబంధిత వ్యక్తులు కెవిపిని కలిసిన తర్వాత పని పూర్తయ్యేదని సూరీడు చెప్పారని తెలుస్తోంది.

డీల్ విషయంలో ఏ పార్టీ వచ్చిన మొదట కెవిపిని కలవాల్సిందేనని, ఆ తర్వాత ఆయనే వారిని నాటి ముఖ్యమంత్రి వైయస్ వద్దకు తీసుకు వెళ్లేవారని చెప్పారట. ఒకవేళ పారిశ్రామికవేత్తలు ఎవరైనా నేరుగా వైయస్‌ను కలిస్తే ఆయన మొదట కెవిపిని కలవమని స్వయంగా చెప్పే వారని సూరీడు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒక వ్యక్తి స్టేట్‌మెంటును బట్టి ఒకరిపై నిందితుడిగా పేర్కొనలేమని సిబిఐ కోర్టుకు నిన్న తెలిపింది.

కెవిపి రామచంద్ర రావుకు వ్యతిరేకంగా ఇతర ఆధారాలు, సాక్ష్యాలు ఎలాంటివి దొరకలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే కెవిపిని నిందితుడిగా ఛార్జీషీట్లలలో పేర్కొనలేదంటున్నారు. అయితే, కెవిపికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించడంపై మాత్రం సిబిఐ దృష్టి సారించింది. కోర్టు కూడా కెవిపి రామచంద్ర రావును నిందితుడిగా చేర్చే అంశం పైన సిబిఐని ప్రశ్నించింది.

English summary
It is said that Sureedu, the personal assistant of Y.S. Rajasekhar Reddy, has alleged that when YSR was chief minister, all deals that involved sanctioning of huge public assets, particularly government land, mines, water allocations, etc., were done only after the industrialists concerned met MP KVP Ramachandra Rao and finalised the “terms” with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X