రాజకీయాలపై మళ్లీ తేల్చిన నాగ్: కొండలను కరిగించాం

అవసరమైతే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డాక్యుమెంట్లను ఎవరైనా చూసుకోవచ్చునని తెలిపారు. తమకు డెబ్బై ఏళ్లుగా తెలిసింది కేవలం సినిమాయే అన్నారు. సినిమానే తమ జీవితమని, తమ జీవితం సినిమాకే అంకితమని చెప్పారు. ఆసియాలోనే ఇన్ని ఎసి ఫ్లోర్లు ఉన్న స్టూడియో మరొక్కటి లేదన్నారు. ఆసియాలోే ఇది ఉత్తమమైనదన్నారు.
నిమ్మగడ్డ స్నేహితుడు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొని చంచల్గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తనకు స్నేహితుడని చెప్పారు. ఆయనకు నైతికంగా మద్దతు ఇచ్చేందుకే తాను చంచల్ గూడ జైలుకు వెళ్లి తరుచూ కలుస్తున్నానని వివరణ ఇచ్చారు.
రాజకీయాలు పడవు.. ఎన్టీఆర్తో నాన్న మాట్లాడారు
తనకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదన్నారు. తమ ఒంటికి రాజకీయాలు ఏమాత్రం పడవన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చనిపోవడానికి ముందు రోజు తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావుతో పావుగంట సేపు మాట్లాడారని చెప్పారు. తన తండ్రి, ఎన్టీఆర్ల బంధం అపరిమితమైనదన్నారు. నంది అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలుపుతున్నానన్నారు.